రష్మిక మంగళ సూత్రం ట్విస్ట్.. విజయ్ దేవరకొండతో పెళ్లిలో..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు గత కొన్నేళ్లుగా సాగుతున్న తమ ప్రేమాయణానికి చెక్ పెడుతూ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. వీరిద్దరూ సెలబ్రిటీ వెడ్డింగ్ స్టైల్‌లో సరికొత్త పంథాను అవలంభిస్తూ ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచారు. తమ పెళ్లి, రిసెప్షన్, హనీమూన్ ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విభిన్నంగా నిర్వహించారు. దాదాపు రెండు నెలలు పాటు విజయ్ - రష్మికల పెళ్లి సందడి కొనసాగిందంటే వీరి ప్లానింగ్‌ని అర్ధం చేసుకోవచ్చు. విరోష్ వెడ్డింగ్‌కి సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

తమ పెళ్లి వేడుకలలో దేశ ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ప్రజలకు స్వీట్స్ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు విజయ్- రష్మిక. హైదరాబాద్‌కు తిరిగొచ్చిన వెంటనే విజయ్ దేవరకొండ పూర్వీకుల స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా బలమూరు మండలం తుమ్మన్‌పేటలో కొత్త జంట సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అలాగే అచ్చంపేట డివిజన్‌లోని 44 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 9, 10 తరగతులు చదువుతున్న పిల్లల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మార్కులు సాధించిన వారికి స్కాలర్‌షిప్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు విజయ్.

rashmika

అనంతరం ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అభిమానులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు విజయ్ - రష్మిక. ఆ వెంటనే మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల కోసం భారీ వెడ్డింగ్ రిసెప్షన్‌‌ జరిగింది. పెళ్లి తర్వాత అన్ని కార్యక్రమాలను ముగించుకుని విజయ్ - రష్మికలు హనీమూన్‌ ఎంజాయ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగినట్లే రష్మిక స్వగ్రామం కర్ణాటకలోని విరాజ్‌పేట్‌లో కొడవ సాంప్రదాయం ప్రకారం వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. పెళ్లయ్యాక అల్లుడిగా కొడగు జిల్లాలో అడుగుపెట్టిన విజయ్‌కి రష్మిక బంధువులు, సన్నిహితులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొడవ జాతి మహిళ మాదిరిగా రష్మిక అలంకరణ ఆకట్టుకుంది.

వివాహ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఇద్దరూ తమ రోజువారీ జీవితంలో బిజీ అయ్యారు. విజయ్ తన రణబాలి షూటింగ్‌లో, రష్మిక మందన్న తన ప్రాజెక్ట్స్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం రష్మిక కాక్‌టెయిల్ 2, మైసా తదితర సినిమాలలో నటిస్తున్నారు. ఇదిలాఉండగా.. విరోష్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఓ సీక్రెట్‌ను ఈ ఈవెంట్‌కు ఆర్గనైజర్‌గా ఉన్న ప్రియా మాగంటి బయటపెట్టారు.

విరోష్ పెళ్లి వేడుకల్లో రష్మిక - విజయ్‌ల వస్త్రధారణ, బంగారు ఆభరణాలు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి. పట్టు పంచె, అంగ వస్త్రంతో ఇవి సింపుల్‌గా కనిపిస్తున్నా.. హుందాగా నిలిచాయి. రష్మిక ఎరుపు రంగు బంగారు అంచుతో రూపొందించిన 9 గజాల చీరను ధరించింది. ఆపై హారం, అరవంకీలు ఆకర్షణగా నిలిచాయి. అలాగే జుంకీలు, జడబిళ్ల, చెంప సవరాలు, ముక్కు పుడక, గాజులు, వడ్డాణం, పాపిట బిళ్ల కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇక విజయ్ చేతి కడియాలు, కాళ్ల కంకణాలు, హారాలు కూడా ప్రాచీన భారతీయ సంస్కృతి, రాజుల నగల ప్రేరణతో తయారు చేశారు. దక్షిణ భారతదేశానికి చెందిన ఓ ప్రముఖ ఆభరణాల సంస్థ వీటిని ఎంతో శ్రమించి తయారు చేసింది.

అయితే మంగళ సూత్రాన్ని రష్మిక మందన్న స్వయంగా డిజైన్ చేసుకున్నారని ప్రియ మాగంటి తెలిపారు. పెళ్లి బట్టలు, ఆభరణాలు అన్నీ రోటీన్‌కు భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అలాగే ట్రెండ్‌ను ఫాలో కావాలని అనుకోలేదని, ఆరెంజ్ కలర్‌ను రష్మిక ఇష్టపడ్డారని ప్రియ చెప్పారు. ఇక రష్మిక మేకప్ ఆర్టిస్ట్ తన్వీ కూడా విరోష్ వెడ్డింగ్‌కి సంబంధించి కీలక విషయాలు పంచుకున్నారు. మేకప్ కోసం తమకు రష్మిక కేవలం 40 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. కానీ 90 నిమిషాల సమయం పట్టింది. సహజత్వం తగ్గకుండా కనిపించాలని రష్మిక చెప్పారని తన్వీ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి రష్మిక తమ పెళ్లి గురించి ఎంతగా శ్రద్ధ తీసుకున్నారో అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X