అఫైర్లను బయపెట్టిన విజయ్ దేవరకొండ.. సమంతకు సీక్రెట్ చెప్పిన రెబెల్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో దసరా సందర్భంగా మహా ఎపిసోడ్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సమంత ఇప్పుడు పూర్తిస్థాయి హోస్ట్‌గా మారిపోయింది. ఆహా యాప్‌లో వినోదంతోపాటు సామాజిక అంశాలను కలిపి సామ్ జామ్ అనే షోను ప్రారంభించబోతున్నారు. నవంబర్ 13వ తేదీన ప్రారంభం కానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ షోకు సంబంధించిన తొలి ఎపిసోడ్‌కు విజయ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చారు. విజయ్ దేవరకొండ, సమంత మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందంటే..

సామ్ జామ్ షో కోసం

సామ్ జామ్ షో కోసం

సామ్ జామ్ రియాలిటీ షో కోసం సమంత ఫుల్‌టైమ్ హోస్ట్‌గా మారిపోయారు. ఈ షోకు కాఫీ విత్ కరణ్, నచ్ బలియే లాంటి షోలను డిజైన్ చేసిన టీమ్ పనిచేస్తున్నారు. తొలి ఎపిసోడ్‌లో సమంత స్టెప్పులు వేస్తూ.. పాటలు పాడుతూ.. ఇతర టీమ్ మెంబర్స్‌తో కలిసి విజయ్ దేవరకొండను ఆహ్వానించారు

విజయ్ దేవరకొండ హంగామా

విజయ్ దేవరకొండ హంగామా

సామ్ జామ్ షో కోసం స్టేజ్‌పైకి వచ్చిన విజయ్ దేవరకొండ హంగామా చేశాడు. తన అఫైర్స్ గురించి విషయాలను ఓపెన్‌గా బయటపెట్టాడు. తనకు అఫైర్లు లేవని చెబుతూ సింగిల్ అని రాసి గ్లాస్ ప్లేట్‌పై సుత్తితో గట్టిగా కొట్టి తన ఇంటెన్షన్‌ను బయటపెట్టారు. దీంతో విజయ్ దేవరకొండ స్టేటస్ సింగిల్ అని తేలిపోయింది.

నేను రెబెల్‌నే.. అసలు విషయాన్ని బయటపెట్టి..

నేను రెబెల్‌నే.. అసలు విషయాన్ని బయటపెట్టి..

ఇక తాను తీసుకొనే నిర్ణయాలు అసాధారణంగా ఉంటాయనే విషయాన్ని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. సినీ అభిమానుల్లో తనకు ఉన్న రెబెల్ యాటిట్యూడ్‌ను ఒప్పుకొన్నారు. తాను రెబెల్‌ అంటూ అది రాసిన ప్లేట్‌ను పగలకొట్టారు. సమంతతో కలిసి చాలా విషయాలు పంచుకొన్నారు. ఈ షో శుక్రవారం ఆహా ఓటీటీలో ప్రసారం కానున్నది.

Recommended Video

#NC20 : Naga Chaitanya's New Film Thank You Movie Opening | Vikram K Kumar

సామాజిక బాధ్యతతో సమంత


ఇక సామ్ జామ్ షోలో కేవలం వినోదమే కాకుండా సామాజిక బాధ్యతను కూడా సమంత అక్కినేని భుజానికి ఎత్తుకొన్నారు. అనాధ, పేదరికంతో బాధపడే పిల్లలకు సహాయం అందించే అంశాలను కూడా ఈ షోలో జోడించారు. చిన్న పిల్లలకు కోరుకొన్న వస్తువులను అందించానికి ఓ గేమ్‌ను కూడా డిజైన్ చేశారు. ఈ షో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకొంటుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X