నిన్ను గర్వపడేలా చేస్తా .. విజయ్ ట్వీట్‌కి రష్మిక ఎమోషనల్

సౌత్‌ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' నేడు (నవంబర్ 7) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించిన ఈ రొమాంటిక్ డ్రామాలో రష్మికతో పాటు దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని మరియు విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ సినిమా విడుదల నేపథ్యంలో హీరోయిన్ రష్మికకు నటుడు విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ విజయ్ ఏమన్నారు? అందుకు రష్మిక ఏం రిప్లే ఇచ్చింది?

రష్మిక నటన, కథ, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం అన్నీ కలసి సినిమా విడుదల రోజునే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. విజయ్ తన ట్విట్ లో "వాళ్లు ఎంతో శక్తివంతమైన సినిమాను రూపొందించారు. ముఖ్యంగా కథ.. ఇది ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా చేస్తుంది. ఈ సినిమాలో ఉన్న నటులందరి నటన అద్భుతం. దర్శకుడు రాహుల్ రవీంద్రన్, రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కలిపి చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల మనసును తాకుతుంది. రేపు థియేటర్లలో వారి మాయాజాలాన్ని చూస్తాం. వెళ్లి సినిమా చూడండి, ఆలోచించండి. గర్ల్ ఫ్రెండ్ మూవీ టీమ్‌కి నా ప్రేమ" అని రాసుకొచ్చారు.

Vijay Deverakonda s Emotional Tweet on Rashmika Mandanna s The Girlfriend Goes Viral

విజయ్ దేవరకొండ ట్వీట్ చూసిన రష్మిక మందన్న వెంటనే స్పందించింది. ఆమె తన ట్వీట్‌లో "అవును ఇది నిజంగా బలమైన కథ. ఇలాంటి కథలు చెప్పడం చాలా ముఖ్యం. అయితే.. ఇలాంటి విషయాలను జీర్ణించుకోవడం కష్టం.కానీ, ఈ సినిమా ప్రభావం మనసులో చాలా కాలం ఉంటుంది. మీరు అద్భుతంగా చెప్పారు విజయ్! థాంక్యూ.. ఇది ఒక 'స్లో బర్న్' లాంటిది, కానీ దీర్ఘకాలం మనసులో మిగిలిపోతుంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే నువ్వు పరోక్షంగా ఇందులో భాగస్వామిగా ఉన్నావు. నేను చేసిన పనిని చూసి ఈసారి నువ్వు గర్వపడతావనిఆశిస్తున్నాను" అని రాసుకొచ్చింది. ఈ ట్వీట్‌లో ప్రతి లైన్‌తో పాటు రష్మిక వాడిన లవ్ ఎమోజీలు నెటిజన్లలో హీట్ పెంచాయి.

రష్మిక స్పందనకు అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా స్పందిస్తున్నారు. "రష్మిక మాటల్లో ఉన్న ప్రేమ, కృతజ్ఞత, భావోద్వేగం కనిపిస్తున్నాయి" అని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు "విజయ్-రష్మిక బంధం ఇప్పుడు మరింత బలపడుతోంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది సరదాగా "ఇన్ని హార్ట్ సింబల్స్ అంటే త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోందేమో!" అంటూ ట్రోల్ కామెంట్లు కూడా పెడుతున్నారు.

ఇక గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూస్ పరిశీలిస్తే.. ప్రేక్షకులు రష్మిక నటనను ఆకాశానికెత్తేస్తున్నారు. "ఇది రష్మిక కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్," "రాహుల్ రవీంద్రన్ తన టేకింగ్ లో మరోసారి హృదయాన్ని తాకాడు," అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎమోషనల్ ఫీలింగ్ తో బయటకు వస్తున్నారు. అలాగే.. సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు "ది గర్ల్‌ఫ్రెండ్ అద్భుతమైన సినిమా. ఇది మహిళల ఆలోచనలను ప్రతిబింబించే కథ," అని ట్వీట్ చేస్తున్నారు.

ఇదెలా ఉంటే.. ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు సంవత్సరాల ప్రేమ తరువాత వీరిద్దరూ 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పలు వార్తలు వెలువడ్డాయి. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ జంట వివాహ వేడుక బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో ఘనంగా జరగబోతుందని సమాచారం.

ఇక రష్మిక ప్రొఫెషనల్ ఫ్రంట్‌లో కూడా బిజీగా ఉంది. ఇటీవల ఆమె బాలీవుడ్‌లో 'థమ్మా' అనే చిత్రంలో అయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దిఖీలతో కలిసి నటించింది. ప్రస్తుతం ఆమె 'కాక్ టైల్ 2' చిత్రంలో కృతీ సనన్, షాహిద్ కపూర్‌లతో కలిసి నటిస్తోంది. అలాగే.. 2023లో విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ 'అనిమల్' సీక్వెల్ 'అనిమల్ పార్క్ (Animal Park)' లో గీతాంజలి పాత్రలో రష్మిక మరోసారి కనిపించనుంది. మరోవైపు విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'కింగ్‌డమ్' తో ప్రేక్షకుల ముందుకు మంచి స్పందన అందుకున్నాడు. మొత్తం మీద, 'ది గర్ల్‌ఫ్రెండ్' విడుదల నేపథ్యంలో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్, రష్మిక మందన్న ఇచ్చి రిప్లే హాట్ టాఫిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X