Tamannaah Bhatia ప్రతిరోజూ తమన్నాకు అది ఉండాల్సిందే.. సీక్రెట్ బయటపెట్టిన లవర్ విజయ్ వర్మ
తమన్నా భాటియా విజయ్ వర్మ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లో అనేక చర్చలకు తావిస్తోంది. ఆసక్తికరంగా వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఏ మాత్రం దాచకుండా కలిసి తాము చేస్తున్న వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ ఉండడంతో ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నాకి సంబంధించిన ఒక సీక్రెట్ బయట పెట్టాడు విజయ్ వర్మ. కాస్త షాకింగ్ అనిపిస్తున్న ఆ అలవాటు ఏంటంటే...
దర్శక నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్ గా: తమన్నా భాటియా ముందుగా తెలుగులో స్టార్ డమ్ సంపాదించింది. మంచు మనోజ్ పక్కన శ్రీ అనే సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె... ఆ తర్వాత ఇక్కడ స్టార్ హీరోయిన్ అనిపించుకునేందుకు చాలా కష్టపడింది.

ఎక్కువ సమయం పట్టకుండానే హ్యాపీ డేస్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాక అప్పట్లో దర్శక నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్ గా నిలిచిపోయింది. అలా తెలుగులో అనేక మంది స్టార్ల పక్కన నటించిన ఆమె ... ఆ తర్వాత సైలెంట్ గా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసింది.
విజయ్ వర్మతో ప్రేమలో పడి: తన తోటి హీరోయిన్లు వివాహాలు కూడా చేసుకుని పిల్లలకు జన్మనిస్తున్న సమయంలో తమన్నా సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. మధ్య మధ్యలో ఫలానా హీరోతో తమన్నా ప్రేమలో ఉందనే వార్తలు తెరమీదకు వచ్చిన అవి కేవలం వార్తలు వరకే పరిమితం అయ్యాయి. అనూహ్యంగా విజయవర్మ అనే ఒక యాక్టర్ తో తమన్నా ప్రేమలో పడిన వ్యవహారం సినీ వర్గాలనే కాదు సినీ అభిమానులను కూడా షాక్ కి గురి చేసింది.

ఎంసీఏ సినిమాతో తెలుగులో ఎంట్రీ: తెలుగులో ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించిన విజయ్ వర్మ బాలీవుడ్ లో అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. వీరిద్దరూ కలిసి పలు ప్రాజెక్టులు చేస్తున్న క్రమంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడడం... స్నేహం ప్రేమగా మారటం... ఆ ప్రేమ ముదిరిపోవడంతో వీరిద్దరూ చట్టా పట్టాలు వేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఫైనల్ గా ప్రేమలో ఉన్నట్టు ఒప్పుకున్నారు.

తమన్నా అలవాటును బయటపెట్టిన విజయ్: తాజాగా లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా తమన్నాకి సంబంధించిన ఒక వింత అలవాటుని విజయవర్మ బయట పెట్టాడు. అదేమిటంటే... ఆమె వర్కౌట్స్ కోసం ఏమైనా చేస్తుందని అవసరం అయితే నిద్ర తగ్గించి అయినా వర్కౌట్ చేయడానికి ఏమాత్రం వెనుకాడదని చెప్పుకొచ్చాడు. నిద్ర చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే ఆరోగ్యానికి ఇబ్బంది అని చెప్పినా నిద్ర తగ్గించిన పర్వాలేదు కానీ వర్కౌట్ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

విజయ్ వర్మపై తమన్నా ప్రశంసలు: ఈ విషయం మీద తమన్నా స్పందిస్తూ నిజానికి తాను ఎక్కువగా తింటాను. కాబట్టి వర్కౌట్స్ మిస్ అవ్వకూడదని కచ్చితంగా ఒక రూల్ పెట్టుకున్నానని నిద్ర తక్కువైనా పర్లేదు. వర్కౌట్స్ మాత్రం తగ్గించను అని చెప్పుకొచ్చింది. ఇక విజయవర్మ చాలా సైలెంట్ గా ఉంటాడని అతను ఇలాంటి అలవాట్ల జోలికి అయితే వెళ్లడం లేదని ప్రస్తుతానికి చాలా కామ్ గా ఉంటాడని అతని మీద ప్రశంసల వర్షం కురిపించింది.


Click it and Unblock the Notifications











