అమితాబ్, రజనీకాంత్ తరువాత.. రూ కోటి రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్ నేనే !
విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకుల మదిలో రాములమ్మగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె హీరోలను సైతం ఢీకొట్టేలా.. దక్షిణాది సినిమాలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగింది. ఇండస్ట్రీలో లేడీ అమితాబచ్చన్ గా పేరుగాంచింది. సిల్వర్ స్క్రీన్ పై విజయశాంతి కనిపిస్తే చాలు ఆనాటి కుర్రాళ్ళు విజిల్స్, క్లాస్ తో థియేటర్లలో రచ్చ రచ్చ చేసేవాళ్ళు. విజయశాంతి యాక్షన్ సీన్స్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆమెను గ్లామర్ హీరోయిన్ కంటే.. యాక్షన్ హీరోయిన్ గానే మంచి పాపులర్టీ తెచ్చుకుంది. ఆమె తన నట ప్రస్థానంలో తెలుగు, తమిళ్, మలయాళం ,కన్నడ, హిందీ భాషలలో దాదాపు 180 సినిమాలలో హీరోయిన్గా నటించి మెప్పించింది.
విజయశాంతి 'కర్తవ్యం' సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అలాగే.. ఏడు సార్లు దక్షిణాది ఫిల్మీఫేర్ అవార్డును గెలుచుకుంది నటి విజయశాంతి. అలాగే ఆరుసార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా గెలుచుకుంది . 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకుంది విజయశాంతి. అంతేకాదు.. నాలుగు సార్లు నంది పురస్కారాన్ని అందుకుంది మహానటి లేడీ అమితాబచ్చన్ విజయశాంతి. 1990 లోనే అత్యధికంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక హీరోయిన్గా గుర్తింపు పొందింది.

విజయశాంతి ' కర్తవ్'యం సినిమాకు ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఆ కాలంలో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న హీరోయిన్ విజయశాంతినే. ఒసేయ్ రాములమ్మ, స్వయంకృషి,ప్రతిఘటన, నేటి భారతం, ముద్దుల మామయ్య, గ్యాంగ్ లీడర్, జానకి రాముడు, చిన్నరాయుడు, నేటి పౌరులు అనే సినిమాలకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే పలు అవార్డులను అందుకుంది విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాలపై ఇంట్రెస్ట్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. బిజీబిజీగా మారింది. రాజకీయాలకు కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంది.
దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ తన ముఖానికి రంగు వేసుకొని మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది విజయశాంతి. ఈ సినిమా కూడా భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. తాజాగా విజయశాంతికి సంబంధించిన ఓల్డ్ ఇంటర్వ్యూ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలు విజయశాంతి మాట్లాడుతూ తన రెమ్యూనరేషన్ సంబంధించిన విషయాలను వెల్లడించింది.
ఆ ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ తన తొలి సినిమాకు తాను ఐదు వేలు రెమ్యూనరేషన్గా తీసుకున్నానని, కానీ, ఆ రోజుల్లో కేవలం తనకు 3000 మాత్రమే ఇచ్చారని, మిగతా 2000 రూపాయలను ఎగ్గొట్టారంటూ తెలిపింది. 5,000 రెమ్యూనరేషన్ నుంచి కోటి రూపాయల పారితోషికం తీసుకునేంత రేంజ్ కు వెళ్లానని తెలిపారు. ఆరోజులో ఇండియా టుడే లో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తర్వాత కోటి రూపాయలు తీసుకుంటున్న హీరోయిన్ విజయశాంతి అంటూ తనపై ఆర్టికల్ కూడా ప్రచురించారని వెల్లడించారు.

అప్పటివరకు టాలీవుడ్ లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటులు ఎవరు లేరని, భారతదేశంలోని హైయెస్ట్ ప్రిమిరేషన్ యాక్టర్స్ గా అమితాబ్ బచ్చన్ , రజనీకాంత్, విజయశాంతి అని పేర్కొన్నారు. అంత రెమ్యూనరేషన్ తీసుకున్నప్పుడు టాలీవుడ్లో ఎవరైనా జలస్ ఫీలయ్యారని ప్రశ్నించగా.. అటు రాజకీయాల్లోనైనా.. సినిమా ఇండస్ట్రీలో అయినా.. ఎవరైనా ఎదుగుతూ ఉంటే పక్కని వారు జలస్ గా ఫీల్ అవుతారని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగడమే మన ప్రయాణం అని, అలా అయితేనే మన గమ్యం చేరుకుంటామని వెల్లడించింది విజయశాంతి.
అలాగే టాలెంట్ ఉన్నవాళ్లకు మాత్రమే కష్టాలు వస్తాయని, వారిని దేవుడు పరీక్షించాలని చూస్తాడని, తాను కూడా ఎన్నో హిట్స్ అందుకున్న తర్వాత.. ముళ్లబాట లాంటి మార్గంలో నడవాల్సి వచ్చిందని ఫీలయ్యారు. అటు రాజకీయాలను మీరు సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కున్నానని, ఆడుతూ పాడుతూ ఉండే సమయంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు విజయశాంతి.
అలాగే.. తనకు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరని, తనకు సినిమా ఇండస్ట్రీలో కూడా స్పెషల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని, ఇటు రాజకీయాల్లో కూడా అలానే ఉంటానని, ఎప్పుడైనా తనకు ఇల్లు, పార్టీ ఆఫీసు, జనాలు అంతేతప్ప మిగతా సర్కిల్ లేదంటూ వెల్లడించింది. ఎవరైనా ఆపతో వస్తే వారిని ఆదుకోవడం వారి బాధలు తెలుసుకోవడమే తన బాధ్యత అని, ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నారంటూ పేర్కొంది. మంచి క్యారెక్టర్లు, యాక్టింగ్ బేస్డ్ పాత్రలు వస్తే కచ్చితంగా సినిమాలలో నటిస్తానని నటి విజయశాంతి వెల్లడించారు.


Click it and Unblock the Notifications











