Arjun S/O Vyjayanthi : విజయశాంతి రెమ్యునరేషన్.. యంగ్ హీరోయిన్లకు ధీటుగా.. ఎన్ని కోట్లంటే?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్టార్ నటి, వెండితెర రాములమ్మ, అగ్ర హీరోయిన్ విజయశాంతి గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. ఈతరం ఆడియెన్స్ ను కూడా విజయశాంతి అలరిస్తూ ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని కొనసాగించింది. 187కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్రను వేసుకుంది. తన నటనతో ఎన్నో అవార్డులను, ప్రశంసలను అందుకుంది. ఆరు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా కూడా విజయశాంతి వెండితెరపై వెలుగుతూనే ఉండటం విశేషం.

తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ నటించి ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ వంటి బిరుదులను కూడా దక్కించుకుంది. అప్పట్లోనే విజయశాంతికి స్టార్ హీరోలకు ఉండేంత ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉండేది. తన 14వ ఏటనే నటిగా జీవితాన్ని ప్రారంభించింది. 1980లో వచ్చిన 'ఖిలాడీ కృష్ణుడు' చిత్రం ఆమె తొలి సినిమా కావడం విశేషం. విజయ శాంతి కెరియర్ లో విమెన్ సెంట్రిక్ చిత్రాల్లో ఎక్కువగా నటించి స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తున్నారు. కర్తవ్యం, ఆశయం, ఓసేయ్ రాములమ్మ వంటి సినిమాలకు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణతో కలిసి అనే చిత్రాల్లో నటించి మెప్పించారు.

Vijayashanthi took Huge Remuneration for Kalyan Ram Arjun Son of Vyjayanthi movie

అలా 2006 వరకు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఆ తర్వాత పొలిటికల్ గా బిజీ అయ్యి సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ సూపర్ స్టార్ మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. మహేశ్ బాబుకు తల్లిపాత్రలో నటించింది. 2020లో ఈ సినిమా విడుదలైంది. మళ్లీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 18న థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. తొలిరోజు సినిమా టాక్ పర్లేదని అనిపించుకుంది. కానీ మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి.

నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విజయశాంతి కళ్యాణ్ రామ్ కు కొడుకు పాత్రలో నటించింది. ఈ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సినిమాకు విజయశాంతి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కళ్యాణ్ రామ్ కు ఎంతో దగ్గరైనా కూడా విజయశాంతి భారీగానే పారితోషికం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఉన్న 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రానికి ఏకంగా 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. కేవలం 40 రోజుల షూటింగ్ కోసం ఈ స్థాయిలో ఛార్జీ చేసిందంటుడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రానికి శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. అశోకా క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. అశోక్ వర్దన్ ముప్పా, సునీల్ బలసు నిర్మాతలుగా వ్యవహరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X