నయనతారపై విజయశాంతి పరోక్ష విమర్శలు.. బతికిపోయారు అంటూ

లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30 ఏళ్ల పాటు టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేసింది. ఆ తరం స్టార్ హీరోలందరితోనూ నటించి మెప్పించింది. ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. ఇప్పటి వరకు నయనతార 180కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. 58 ఏళ్ల వయస్సులోనూ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. 15 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ప్రధాన పాత్రలతో అలరిస్తున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ, గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్ స్పెక్టర్, స్వయం కృషి వంటి ఎన్నో చిత్రాలతో సక్సెస్ అందుకుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. మరోవైపు మొదటి నుంచే రాజకీయాల్లోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎక్కువ కాలం పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ హోదాలో ప్రజా సేవా చేస్తున్నారు విజయశాంతి. ఇక 2006 వరకు సినిమాల్లో యాక్టివ్ గా కనిపించినా ఆ తర్వాత గ్యాప్ ఇచ్చారు.

Vijayashanti criticism of Nayanthara

మళ్లీ 14 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుకు అమ్మగా 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంలో నటించి ప్రేక్షకులను పలకరించింది. ఇక మళ్లీ ఐదేళ్ల తర్వాత రీసెంట్ గా కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' చిత్రంతో అలరించింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దుమ్ములేపింది. ప్రస్తుతం ఈ సినిమా ఏప్రిల్ 18 నుంచి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయశాంతి పలు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం విశేషం. ఈ సందర్బంగా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా రిలీజ్ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో లేడీ సూపర్ స్టార్ అనే బిరుదుపై స్పందించారు. తనకు లేడీ సూపర్ సూపర్ స్టార్ అనే బిరుదును ప్రేక్షకులే ఇచ్చారని తెలిపింది. ప్రతిఘటన చిత్రం తర్వాత ఆ ట్యాగ్ దక్కిందన్నారు. ఇక తను సినిమాల్లో యాక్టివ్ గా లేకపోవడంతో ఆ ట్యాగ్ ను కొంత మంది హీరోయిన్లు తీసుకున్నారని చెప్పింది. పాపం వాళ్లు కూడా బతకాలి కదా అని పట్టించుకో లేదు.. అంటూ విజయశాంతి తనకున్న లేడీ సూపర్ స్టార్ బిరుదుపై స్పందించారు.

అయితే విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును హీరోయిన్ నయనతారకు వినిగించిన సంగతి తెలిసిందే. దాంతో విజయశాంతి నయనతారను ఉద్దేశించే ఇలా మాట్లాడిందా? అని సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. ఇక నయనతార కూడా ఇటీవల తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దని, తనకు నచ్చని కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు విజయశాంతి మాటలు ఆమెకు కౌంటర్ గా ఉన్నాయని అంటున్నారు.

More from Filmibeat

Read more about: vijayashanti nayanthara tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X