రాజకీయాలకు దూరంగా విజయశాంతి, పోటీచేసేందుకు విముఖత... కారణం అదేనా!?

సుమారు రెండు దశాబ్దాల పాటూ తెలుగు వారిని తన అందచందాలతో పాటూ, డైనమిక్ హీరోయిన్ గానూ అలరించిన విజయశాంతి ఇప్పుడిప్పుడే మళ్లీ వెండితెరపై అలరిస్తున్న వైనం తెలసిందే. మళ్లీ సిల్వర్ స్క్రీన్ ఇచ్చిన కిక్కో ఏమో కానీ, ఆమెకు రాజకీయాలపై ఆసక్తి సన్నగిల్లుతోందని తెలుస్తోంది.

రాజకీయాల్లో బిజీగా మారిన దగ్గర నుంచీ సినిమాలకు దూరంగానే ఉంటోన్న విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ సంగతి తెలిసిందే. మరోసారి డైనమిక్ మదర్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ సంగతి పక్కన పెడితే... విజయశాంతి మాత్రం మరిన్ని సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది.

VijayShanthis lost interest in Politics!?

ఇటీవలే దుబ్బాక ఉపఎన్నికలకు నగారా మోగడంతో, విజయశాంతి మళ్లీ రాజకీయాల్లో బిజీగా మారతారని అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తోపాటూ, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు సైతం పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనే కాంగ్రెస్ తరఫున విజయశాంతి పోటీ చేయబోతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే, విజయశాంతి ఆలోచన మరోలా ఉందని తెలుస్తోంది.

పోటీ చేయాలన్న ఆలోచన ఉంటే, టికెట్ కేటాయిస్తామని హై కమాండ్ సైతం చెప్పినా, విజయశాంతి ఇందుకు విముఖత వ్యక్తం చేశారట. ఇక పోతే ఈ వార్త ఫిల్మ్ నగర్ లోనూ దావణంలా వ్యాపించింది. విజయశాంతి తిరిగి రాజకీయాలతో బిజీగా మారబోవడంలేదని తెలియడంతో, దర్శక-నిర్మాతలు సైతం ఆమె కోసం ప్రత్యేకమైన పాత్రలు సృష్టిస్తున్నారని వినికిడి. మరి ఈసారి విజయశాంతి ఏ విధంగా అలరిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X