ఇప్పటి హీరోయిన్లు దారుణం: ఘాటుగా విజయశాంతి కామెంట్.. అప్పుడు నా వెంట పడేవారని!

అలనాటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి టాలీవుడ్‌లో మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ వెండితెర మీద సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..

హీరోయిన్లకు ఫోకస్ లేదు

హీరోయిన్లకు ఫోకస్ లేదు

ఇప్పుడు వస్తున్న హీరోయిన్లలో టాలెంట్ లేదు. కెరీర్, నటనపై ఫోకస్ లేదు. ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రతిభ లేదు అంటూ విజయశాంతి ఘాటుగా స్పందించడం సినీ వర్గాల్లో సంచలనం రేపుతున్నది. మా తరం హీరోయిన్లు చాలా కష్టపడే వారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. వాటితో పాటు వర్కింగ్ స్లైల్‌ కూడా మారిపోయింది. ఎలాంటి ఫోకస్ లేకుండా ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. మా రోజుల్లో రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా పనిచేసే వాళ్లం అని విజయశాంతి అన్నారు.

మేమైతే ఆరు షిప్టులు పనిచేసేవాళ్లం

మేమైతే ఆరు షిప్టులు పనిచేసేవాళ్లం

నేను హీరోయిన్‌గా పనిచేసే సమయంలో ఒక రోజు ఆరు షిప్టులు పనిచేసే వాళ్లం. ఒక సెట్ నుంచి మరో సెట్‌కు పరుగులు పెడుతుండే వాళ్లం. ఒక రోజు ఉదయం 5 గంటలకే షూటింగ్ ప్రారంభించి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు షూటింగ్ క్లోజ్ చేసిన రోజులు ఉన్నాయి. అలా షూటింగ్ ముగించుకొని మళ్లీ సెట్‌కు వెళ్లిన సందర్భాలు కోకొల్లలు. నిద్ర లేకుండా షూటింగ్‌లకు హాజరయ్యే దానిని. అలా సంవత్సరానికి సుమారు 20 సినిమాలు చేసే దానిని అని విజయశాంతి పేర్కొన్నారు.

అలా నా వెంటపడేవారు..

అలా నా వెంటపడేవారు..

నేను పనిచేసే తీరు ప్రతీ నిర్మాత, దర్శకుడిని ఆకట్టుకొనేది. ఆ సమయంలో ప్రతీ ఒక్కరు విజయశాంతి కావాలి అని అడిగేవారు. ఆ సమయంలో అంత డిమాండ్ కూడా ఉండేది. అలాంటి డిమాండ్ సమయంలో చాలా సినిమాలు వదులుకొన్నాను. ఒక యాక్టర్ సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేయగలరు. ఆ సమయంలో నా వల్ల ఎంత అవుతుందో అంత మేరకు నేను పనిచేశాను అని విజయశాంతి అన్నారు.

ఈ తరం హీరోయిన్లు దారుణం

ఈ తరం హీరోయిన్లు దారుణం

కానీ ఈ తరం హీరోయిన్లను చూస్తే నవ్వొస్తుంది. చాలా విలాసంగా సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు. కొందరైతే అంతకంటే తక్కువగా కూడా చేస్తున్నారు. ఇష్టం ఉంటే సినిమా చేస్తున్నారు లేదంటే ముఖం చాటేస్తున్నారు. అలాంటి హీరోయిన్లను చూస్తే భయం వేస్తున్నది అని విజయశాంతి అన్నారు.

స్కూల్‌కు వెళ్లిన ఫీలింగ్

స్కూల్‌కు వెళ్లిన ఫీలింగ్

పదేళ్ల తర్వాత మళ్లీ షూటింగ్‌కు హాజరయ్యాను. సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్‌కు హాజరయ్యే ముందు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. చాలా ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. ఇప్పుడు అంతా మారిపోయింది. సాంకేతికంగా నాకు అంతా కొత్తగానే ఉంది. స్కూల్‌కు తొలి రోజు పిల్లాడు వెళ్లితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అదే పరిస్థితి నాది అని విజయశాంతి అన్నారు.

సంక్రాంతి బరిలో రాములమ్మ

సంక్రాంతి బరిలో రాములమ్మ

మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, F2 మూవీ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి రూపొందిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం సంక్రాంతి 2020కి రిలీజ్ కానున్నది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్నది. కొన్ని రోజుల్లో షూటింగ్ పార్ట్ ముగిసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి వెళ్లనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X