twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమార్కుడులో నటించిన ఆ చిన్నారి, ఇప్పుడు హీరోయిన్స్ కంటే అందంగా.. వయసెంతో తెలుసా?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టుగా చేసి ఆ తరువాత కొన్నాళ్లకు లీడ్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే అలా వచ్చిన వారిలో కొంతమంది మాత్రమే నిలదొక్కుకుంటున్నారు. ఇక హీరోయిన్స్ గా క్లిక్కయిన వారు చాలా తక్కువమంది ఉన్నారు. అయితే విక్రమార్కుడు, రాజన్న సినిమాలో నటించిన 'అనీ' గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా మరిపోయిందో చూస్తే షాక్ అవుతారు.

    కొంటె చూపులతో కవ్విస్తోన్న సమంత (బర్త్‌డే స్పెషల్ ఫొటోలు)

     చిన్న వయసు నుంచే నటిగా..

    చిన్న వయసు నుంచే నటిగా..

    బేబి ఆనిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మాయి మాతృభాష మలయాళం. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో పేరెంట్స్ తోనే ఉంటున్న ఆని 5ఏళ్ళ వయసు నుంచే నటిగా బిజీ అయ్యింది. ఆమె మొదట జగపపతి బాబు, ఛార్మి నటించిన అనుకోకుండా ఒకరోజు సినిమాలో నటించింది. ఆ తరువాత స్టాలిన్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది.

    అదే కెరీర్ యూ టర్న్

    అదే కెరీర్ యూ టర్న్

    ఇక ఆమెకు ఎక్కువగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. రాజమౌళి ఆ చిన్నారితో ఏదైనా ఎమోషనల్ క్యారెక్టర్ చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారట. ఇక విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురి పాత్ర కోసం ఆమె కరెక్ట్ గా సెట్టవుతుందని ఒక్క ఆడిషన్ లోనే ఫిక్స్ చేశారు.

    స్టార్ హీరోలందరితో..

    స్టార్ హీరోలందరితో..

    విక్రమార్కుడు అనంతరం అనీ చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఆమె దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, గోపిచంద్, రామ్ , ఉదయ్ కిరణ్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ షేర్ చేసుకుంది.

    అప్పుడే నంది అవార్డు

    అప్పుడే నంది అవార్డు

    ఇక రాజన్న సినిమాల్లో దాదాపు నాగార్జునతో సమానంగా పవర్ఫుల్ పాత్రలో కనిపించింది. కె.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో ఆమె చేసిన మల్లమ్మ పాత్రకు గాను ఏకంగా నంది అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక ఆ సినిమాకు ఎంతో ఇష్టంగా జక్కన్న యాక్షన్ సీన్స్ ను డైరెక్ట్ చేశారు.

    హీరోయిన్స్ కంటే అందంగా..

    హీరోయిన్స్ కంటే అందంగా..

    ఇక చాలా కాలం తరువాత అనీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటితరం హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా అందమైన నవ్వుతోనే కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 20 ఏళ్ళు. ఇక 2012 నుంచి స్టడీస్ కోసం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆని చివరగా రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చెల్లెలి పాత్రలో నటించింది. ఆ మధ్య హీరోయిన్ గా ట్రై చేస్తున్నట్లు రూమర్స్ అయితే వచ్చాయి.

    English summary
    Some in the Tollywood industry are showing interest in becoming lead artists for years after becoming a child artist. But only a handful of those who have come so far survive. And there are very few who are clicked as heroines. However, everyone knows about 'Annie' who played Vikramarkudu and Rajanna in the film. Now it would be a shock to see how that girl is forgotten.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X