For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాత్రూంలో హాట్ సెల్ఫీతో చరణ్ హీరోయిన్ రచ్చ: లోదుస్తుల్లో అలాంటి ఫోజులతో పిచ్చెక్కిస్తోందిగా!

  |

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. అద్భుతమైన అందంతో ఆ రంగంలో తన హవాను చూపించి సత్తా చాటింది హాట్ బ్యూటీ ఈషా గుప్తా. మోడలింగ్ రంగంలో సక్సెస్ అయిన ఆమె.. సినీ రంగం ప్రవేశం కూడా చేసింది. ఈ క్రమంలోనే పలు రకాల పాత్రలతో ప్రేక్షకులను మైమరపించింది. ఇక, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. సినిమాలు చేయకున్నా ఫ్యాన్స్‌కు మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటోంది. అదే సమయంలో తన అందచందాలతో వాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాత్రూంలో దిగిన ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  ఆర్తి వెంకటేష్ బ్యూటీఫుల్ ఫోటోలు.. వైరల్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

   మిస్ ఇండియాగా ఎంపిక.. బాలీవుడ్ ఎంట్రీ

  మిస్ ఇండియాగా ఎంపిక.. బాలీవుడ్ ఎంట్రీ

  విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది ఈషా గుప్తా. ఈ క్రమంలోనే ఎన్నో పోటీల్లో పాల్గొంది. అలా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజయం సాధించింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఫలితంగా వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ, కొంత గ్యాప్ తీసుకున్న ఆమె.. ‘జన్నత్' అనే హిందీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

  స్పెషల్ సాంగ్‌లతో రచ్చ.. తెలుగులో చరణ్

  స్పెషల్ సాంగ్‌లతో రచ్చ.. తెలుగులో చరణ్

  బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈషా గుప్తా వరుసగా ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడిపింది. అదే సమయంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది. కేవలం హిందీలోనే కాదు.. రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ'లో ‘ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో నర్తించింది.

   ఇండియన్ క్రికెటర్‌తో ప్రేమ.. పెళ్లి వల్ల స్టాప్

  ఇండియన్ క్రికెటర్‌తో ప్రేమ.. పెళ్లి వల్ల స్టాప్

  అప్పటి వరకూ కెరీర్ పరంగా వచ్చిన గుర్తింపుతో ఫేమస్ అయిన ఈషా గుప్తా.. టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందన్న వార్తతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. వీళ్లిద్దరూ కలిసి ఓ సారి డిన్నర్‌కు వెళ్లారు. దీంతో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే, పాండ్యా నటాషాను వివాహం చేసుకోవడంతో ఈషాపై వచ్చిన వార్తలకు పుల్‌స్టాప్ పడింది.

  ఆ స్టార్లతో డేటింగ్ చేస్తుందన్న ప్రచారం వల్ల

  ఆ స్టార్లతో డేటింగ్ చేస్తుందన్న ప్రచారం వల్ల

  మోడలింగ్ రంగంలోనే తన సత్తాను నిరూపించుకున్న ఈషా గుప్తా.. సినీ కెరీర్‌ను మాత్రం అంత సాఫీగా సాగించలేకపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అదే సమయంలో ఆమె కొందరు హీరోలతో డేటింగ్ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ వార్తల ఈ బ్యూటీ ఖండించినప్పటికీ పుకార్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ విధంగానూ ఈషా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

  అందులో ఎప్పుడూ బిజీగానే.. రచ్చ చేస్తోంది

  అందులో ఎప్పుడూ బిజీగానే.. రచ్చ చేస్తోంది

  కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈషా గుప్తా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ విషయం ఆమెను ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ అమ్మడు అందులో కొంత కాలంగా హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తన సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత జీవిత విషయాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటూ రచ్చ చేస్తోంది.

  హాట్ ఫొటోల స్పెషలిస్టుగా పేరొందిన భామ

  హాట్ ఫొటోల స్పెషలిస్టుగా పేరొందిన భామ


  ఈషా గుప్తాకు సోషల్ మీడియాలో ఎనలేని పాపులారిటీ వచ్చింది. దీనికి కారణం ఈమె అందులో చేసే హడావిడే అన్న విషయం తెలిసిందే. అంతలా ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేసే పిక్‌లను ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో హాట్ బాంబ్ అనే పేరుతో పాటు ఫాలోవర్లనూ పెంచుకుంటోంది.

   బాత్రూంలో హాట్ సెల్ఫీతో హీరోయిన్ రచ్చ

  బాత్రూంలో హాట్ సెల్ఫీతో హీరోయిన్ రచ్చ

  చాలా రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న ఈషా గుప్తా.. తాజాగా ఓ హాట్ సెల్ఫీతో రెచ్చిపోయింది. బాత్రూంలోని అద్దం ముందు దిగిన ఓ ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె కేవలం లోదుస్తులు మాత్రమే ధరించి ఉంది. ఇంకేముంది? ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది అప్పుడే వైరల్ అయిపోయింది.

  English summary
  Indian film actress, Model and the winner of the Miss India International title of 2007 Esha Gupta Shared Hot Bathroom Selfie in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X