For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పబ్‌లో అందరి ముందే భర్తను దారుణంగా.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఏం చేసిందో చూడండి (వీడియో)

  By Manoj
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అలాంటి వారిలో కొందరు మాత్రమే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంటుండగా... మరికొందరు మాత్రం తళుక్కున మెరిసి మాయమైపోతున్నారు. ఆ జాబితాలోకి వస్తుంది ముంబై బ్యూటీ అనిత హాస్సానందినీ. చాలా ఏళ్ల క్రితం తెలుగు వారికి పరిచయం అయిన ఈ అమ్మడు.. ప్రస్తుతం బుల్లితెరపై సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తను కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.!

  ఉదయ్ కిరణ్‌ ప్రేమతో మొదలు పెట్టింది

  ఉదయ్ కిరణ్‌ ప్రేమతో మొదలు పెట్టింది

  తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చిత్రం ‘నువ్వు నేను'. ఈ సినిమా ద్వారానే అనిత తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇది సూపర్ హిట్ అవడంతో వరుస ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే ‘శ్రీరామ్', ‘తొట్టిగ్యాంగ్', ‘నిన్నే ఇష్టపడ్డాను', ‘ఆడంతే అదోటైపు', ‘ఆహా నాపెళ్లంట' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

  ఆఫర్లు వచ్చినా.. అదృష్టం కలిసి రాలేదు

  ఆఫర్లు వచ్చినా.. అదృష్టం కలిసి రాలేదు

  అనిత తెలుగులో నటించిన చిత్రాల్లో ‘నువ్వు నేను' మినహా మరేదీ పెద్దగా విజయం సాధించలేదు. అయినప్పటికీ ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలోనే ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, అదృష్టం కలిసి రాకపోవడంతో నిరాశకు లోనయింది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళం, హిందీ, కన్నడం, పంజాబీలలో కూడా నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

  నిర్ణయం మార్చుకుంది.. ఫేమస్ అయింది

  నిర్ణయం మార్చుకుంది.. ఫేమస్ అయింది

  ఎన్ని సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రాలేదు అనితకు. దీంతో ఆమె సినిమాల్లో నటించడం మానేసింది. అదే సమయంలో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ‘హరే కంచ్‌కి చుడియాన్' అనే సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె.. ఆ తర్వాత ఎన్నో సీరియళ్లలో నటించి మెప్పించింది. వాటిలో తెలుగులోనూ ప్రసారమైన ‘నాగినీ' సిరీస్‌ ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.

  బిజినెస్‌మ్యాన్‌తో అనిత ప్రేమాయణం.. పెళ్లి

  బిజినెస్‌మ్యాన్‌తో అనిత ప్రేమాయణం.. పెళ్లి

  టీవీ సీరియళ్లతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలోనే అనిత.. రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. 2013లో అగ్నిసాక్షిగా ఒక్కటైంది. అప్పటి నుంచి వీరిద్దరూ సంతోషంగా గడుపుతున్నారు. వివాహం తర్వాతనే అనితకు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. భర్త సహకారంతో ఆమె కెరీర్ సాఫీగా సాగుతోంది.

  పెళ్లైనా గ్లామర్‌గానే.. భర్తతో ఘాటు రొమాన్స్

  పెళ్లైనా గ్లామర్‌గానే.. భర్తతో ఘాటు రొమాన్స్

  సినిమాలు, సీరియళ్ల కోసం గ్లామర్‌గా కనిపించడానికి వెనుకాడలేదు అనిత. పర్సనల్ లైఫ్‌లోనూ ఆమె అదే పంథాను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే హాట్ హాట్ ఫొటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది. అంతేకాదు, హీటెక్కించే వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా భర్తతో ఘాటు రొమాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వదులుతోంది.

  అనిత గర్భవతి... కవల పిల్లలకు జన్మనిస్తుంది

  అనిత గర్భవతి... కవల పిల్లలకు జన్మనిస్తుంది

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది సీనియర్ హీరోయిన్ అనిత. ఇందులో భాగంగానే గత ఏడాది ఫేక్ కడుపుతో ఓ ఫోటోను షేర్ చేసింది. ‘నేను ఫేక్ కడుపుతోనే ఇలా ఉన్నానంటే.. నిజంగా గర్భవతిని అయితే ఎలా ఉంటుందో' అని క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆమె నిజంగానే కడుపుతో ఉందని, కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని ప్రచారం జరిగింది.

  అందరి ముందరే భర్తను అక్కడ కొట్టింది

  భర్తతో గడిపిన మధురమైన క్షణాలకు సంబంధించిన విషయాలను పంచుకునే అనిత... తాజాగా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. గతంలో అనిత.. తన భర్తతో కలిసి పబ్‌కు వెళ్లింది. ఆ సమయంలో అతడిని భుజంపై తడుతూ పిలిచింది. సౌండ్‌కు వినిపించకపోవడంతో అతడు పలకలేదు. దీంతో కోపంగా అతడి పిరుదులపై కొట్టింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

  English summary
  Anita Hassanandani is an Indian actress who has acted in multilingual films and serials. She is best known for portraying Shagun Arora in Star Plus's Yeh Hai Mohabbatein and a female shape-shifting serpent named Vishakha Khanna in Colors TV's Naagin.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X