Virosh: పిల్లలపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్.. వారి కోసం యుద్దం చేస్తా అంటూ..

Virosh Wedding: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న (Vijay - Rashmika) మూడు మూళ్ల బంధంతో ఒక్కటైంది. పెళ్లి తర్వాత ప్రతి అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెళ్లి ఫోటోలు వైరల్ అవుతుండగానే, తాజాగా సంగీత్ వేడుక ఫోటోలు షేర్ చేయడంతో అభిమానుల్లో మరోసారి ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సెలబ్రెటీ పెళ్లి సందడిలోని ప్రతీ వేడుకు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ తరుణంలో రష్మిక గతంలో పిల్లలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఇద్దరు దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన తమ ప్రేమని ఏకంగా పెళ్లితో బహిర్గతం చేశారు. అత్యంత సన్నిహితుల మధ్య చాలా గ్రాండ్‌గా తమ మ్యారేజ్‌ చేసుకోవడం విశేషం. ఇప్పుడు అంతా వీరి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. పెళ్లి తర్వాత విజయ్‌ దేవరకొండ సొంతూరులో సోమవారం సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అలాగే.. ఆలయ దర్శనాలు, సంప్రదాయ పూజలు నిర్వహిస్తూ ఈ జంట కుటుంబ పెద్దల ఆశీర్వాదాలు పొందుతోంది.

Virosh Wedding Buzz Rashmika Mandanna s Emotional Comments on Motherhood Go Viral After Marriage

ఇక మంగళవారం ఉదయం నుంచి విజయ్-రష్మిక సంగీత్ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. వీరద్దరూ కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు, నవ్వుల్లో మునిగిపోయిన క్షణాలు, స్టైలిష్ లుక్స్ అన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్య ఎంతో ఆత్మీయంగా ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అభిమానులను ఫిదా చేస్తోంది. ఇక బుధవారం(మార్చి 4)న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రిసెప్షన్‌ ప్లాన్‌ చేశారు. తాజ్‌ కృష్ణలో వీరి రిసెప్షన్‌ జరుగుతుంది.

పిల్లలపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్
ఇదిలా ఉంటే.. గతంలో రష్మిక మందన్న పిల్లల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. పెళ్లికి ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. 'నేను ఇంకా తల్లి కాలేదు. కానీ నాకు పిల్లలు పుడతారని ముందే ఫీల్ అవుతున్నాను. ఇంకా పుట్టని ఆ చిన్నారుల గురించి ఇప్పటినుంచే ఆలోచిస్తున్నాను. వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను. అవసరమైతే యుద్ధం చేయడానికైనా వెనకాడను' అంటూ రష్మిక చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

పిల్లలంటే తనకు ప్రేమ, రక్షణ భావన ఉంటుందని, కొన్నిసార్లు ఇప్పటికే తల్లి అయిన ఫీలింగ్ కలుగుతుందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ ఉన్నప్పటికీ, భవిష్యత్తులో కుటుంబం ఏర్పరుచుకోవాలని ఉందని తెలిపారు. ఆమె ఇప్పటికే తల్లి అయిన ఫీలింగ్‌లో ఉన్నట్టు తెలిపింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. విజయ్‌తో కలిసి 'రణబాలి' సినిమాలో నటిస్తోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' అల్లు అర్జున్ తదుపరి సినిమాలోనూ నటిస్తోంది.'కాక్‌టెయిల్ 2' వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

ఇలా మొత్తానికి రష్మిక గతంలో చేసిన కామెంట్స్‌ను నెటిజన్స్ సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఈ క్రమంలో కొందమంది 'ఇంకా పెళ్లయిన కొత్తలోనే పిల్లల గురించి?' అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు ఆమె బాధ్యతాయుతమైన ఆలోచనలను ప్రశంసిస్తున్నారు. మరికొందరూ అయితే.. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పే అవకాశముందా? అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X