బికినీలో షాకిచ్చిన విరూపాక్ష హీరోయిన్: తడిచిన దేహంతో తళతళ మెరుస్తూ!

గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వేరే భాషల అమ్మాయిలు చాలా మందే వస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో మల్లు బ్యూటీ సంయుక్త మీనన్ ఒకరు. టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తనదైన రీతిలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సంయుక్త మీనన్ కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

అలా వచ్చి ఫుల్ ఫేమస్
కేరళకు చెందిన సంయుక్త మీనన్ 2016లో వచ్చిన 'పాప్‌కార్న్' అనే చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత అదే భాషలో ఎన్నో సినిమాలను చేసింది. ఈ క్రమంలోనే తమిళంలోకి అడుగు పెట్టి అక్కడ కొన్ని చిత్రాల్లో కనిపించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మలయాళం, తమిళంలో చాలా సినిమాల్లో నటించి మంచి పేరుతో పాటు ఫుల్ ఫేమస్ అయిపోయింది.

Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos Goes Viral

పవన్‌తో.. వరుస హిట్లతో
సౌత్‌లో యమ పాపులర్ అయిన సంయుక్త మీనన్ 'భీమ్లా నాయక్' మూవీ ద్వారా తెలుగులోకి ఎంటరైంది. ఇందులో మంచి పాత్రను పోషించిన ఈ భామ.. ఆరంభంలోనే అందరి దృష్టిని పట్టేసింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార', ధనూష్ 'సార్'లతో హిట్లు మీద హిట్లు కొట్టి లక్కీ హీరోయిన్‌ అనిపించుకుంది.

ఒక హిట్.. ఒక డిజాస్టర్
'సార్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సంయుక్త మీనన్ 'బూమరాంగ్' అనే మలయాళ సినిమాలోనూ నటించి అలరించింది. ఆ వెంటనే ఈ బ్యూటీ.. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'విరూపాక్ష'లో హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్‌గా నిలిచింది. ఆ వెంటనే కల్యాణ్ రామ్‌తో 'డెవిల్' మూవీలోనూ నటించింది. కానీ, ఇది ఆమెకు నిరాశనే మిగిల్చింది.

Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos Goes Viral

ఇప్పుడు ఖాళీ.. పెళ్లితో
టాలీవుడ్‌లో గోల్డెన్ హీరోయిన్ అనిపించుకున్న సంయుక్త మీనన్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులను చేయడం లేదు. కానీ, కొన్ని ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. అంతేకాదు, ఆమె ఫలానా అబ్బాయితో ఏడు అడుగులు నడవబోతుందని కూడా ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.

అక్కడ యమ యాక్టివ్
సౌత్ ఇండియా మొత్తంలో తనదైన చిత్రాలతో అలరిస్తోన్న సంయుక్త మీనన్.. కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది.

Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos Goes Viral

గ్లామర్‌తో షేక్ చేసేసి
మల్లూ బ్యూటీ సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో చాలా కాలంగా హడావిడి చేస్తూ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె హద్దు దాటకుండానే గ్లామర్ ట్రీట్ ఇస్తూ కవ్విస్తోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను కొసరి కొసరి చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.

సంయుక్త పిక్స్ వైరల్
సినిమాల్లో డీసెంట్‌గా కనిపిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతోన్న సంయుక్త మీనన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ఎప్పుడూ లేని విధంగా బికినీలో కనిపించింది. ఇందులో ఆమె అందాలు తళతళా మెరుస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవి ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X