నా కంటే వయసులో చాలా పెద్ద.. అతడితో పెళ్లి.. విష్ణు ప్రియ నోట షాకింగ్ విషయాలు

తెలుగు బుల్లితెరపైనా, అలాగే వెండితెరమైన తన గ్లామర్, టాలెంట్‌తో రాణిస్తున్న యాక్టర్, యాంకర్ విష్ణుప్రియ. గత కొద్దికాలంగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. యాక్టర్‌‌గా, యాంకర్‌గా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం విష్ణు ప్రియ బిగ్‌బాస్‌ తెలుగు 8 షోలో బిజీగా ఉన్నారు. అయితే ఆమె పాత వీడియో ఒకటి మీడియాలో యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

యూట్యూబ్ కోసం చేసిన వీడియోలో జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన బాధితురాలితోపాటు టీవీ యాక్టర్, బిగ్‌బాస్ ఫేమ్, బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ నాగులపల్లి, విష్ణుప్రియ ఉన్నారు. అయితే గతంలో మానస్, విష్ణుప్రియ కలిసి గంగులూ అనే పాటలో నటించారు. ఆ పాటకు జానీ మాస్టర్ బాధితురాలు కొరియోగ్రఫిని అందించారు. ఆ సందర్బంగా ఆ టీమ్ మాట్లాడుకొంటూ ఫన్నీగా ఇంటర్వ్యూ చేశారు.

Vishnu Priya Reveals her marriage plans with older Guy Here is the Detail story

ఈ చిట్ చాట్‌లో పెళ్లి గురించి మాట్లాడుకొంటూ జానీ మాస్టర్ బాధితురాలు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. నాకు ఇంకా 20 సంవత్సరాలే అని చెప్పారు. అయితే నాకు 28 సంవత్సరాలు. నాకు అర్జంట్‌గా పెళ్లి చేసుకోవాలని ఉంది. వరుడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను. ఆ వరుడు ఎక్కడున్నాడో అని విష్ణు ప్రియ చెప్పింది.

నేను బాధలో ఉన్నప్పుడు చిల్ అవ్వడానికి డ్యాన్స్ చేస్తాను. స్కోక్ చేస్తాను. నాకు నేనుగా ఎంజాయ్ చేస్తాను. చాలా రేర్‌గా ఫ్రెండ్స్‌ను కలుస్తాను అని విష్ణుప్రియ చెప్పింది. కేరళ నాకు నచ్చిన ప్రదేశం. నేను ఒంటరిగానే వెళ్లి వస్తుంటాను అని విష్ణు ప్రియ చెప్పింది.

Vishnu Priya Reveals her marriage plans with older Guy Here is the Detail story

నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. ఒక పర్సన్ కనిపించడం లేదు. నాకు నచ్చిన వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే నా కంటే ఆయన ఎక్కువ వయసులో ఉన్నాడు. మా పెళ్లికి వయసు తేడా అడ్డంకి అయింది. ఆ తర్వాత నాకు నచ్చిన వ్యక్తి నాకు దొరకలేదు. ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను అని విష్ణు ప్రియ అన్నారు.

నేను పెళ్లి చేసుకోవాలనుకొంటున్న వ్యక్తి యాక్టర్ అయి ఉండాలి. గుర్రం స్వారీ వచ్చి ఉండాలి. జిమ్ చేయాలి అంటూ తన కోరికలను బయట పెట్టింది. ప్రస్తుతం బిగ్‌‌బాస్‌లో విష్ణుప్రియ ఫుల్ రొమాంటిక్ మూడ్‌లో ఉంది. పృథ్వీతో లవ్ ట్రాక్ నడుపుతున్నది. అయితే బిగ్‌బాస్ నుంచి వచ్చే లోపు తనకు నచ్చిన వ్యక్తి లభిస్తాడో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X