వేణుస్వామి అలాంటి వారే.. ఆ విషయంలో.. విష్ణు ప్రియ గుట్టురట్టు
తెలుగు వినోద పరిశ్రమలోని యంగ్ టాలెంట్‌లో విష్ణు ప్రియ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. యాంకర్‌గా, హోస్ట్‌గా, నటిగా, టెలివిజన్ ప్రజెంటర్‌గా ఎన్నో రకాలుగా తన ప్రతిభను చాటుకొన్నారు. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొన్నారు. తాజాగా ఓ టాక్‌లో మాట్లాడుతూ తన జీవితంలో తనకు ఎదురైన పరిస్థితులు, వాటిని అధిగమించిన తీరు.. అలాగే వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ఆమె వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
విష్ణు ప్రియ భీమినేని విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ అందాల భామ 2018 సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. టెలివిజన్ రంగంలో గేమ్ షో టాలీవుడ్ స్క్వేర్‌లో గెస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో రియాలిటీ షోలు, కామెడీ షోలలో యాంకర్, గెస్టుగా కనిపించారు. క్యాష్, డ్యాన్స్ జోడి డ్యాన్స్, లేడీస్ అండ్ జెంటిల్మన్, అనుభవించు రాజా షో ద్వారా ఆమెకు మరింత గుర్తింపు లభించింది.

ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె పలు చిత్రాలు, వెబ్ సీరిస్‌లలో నటించింది. వాంటెడ్ పండుగాడు.. ది బేకర్ అండ్ బ్యూటీ, చెక్ మేట్,100 లాంటి సినిమాలు, అలాగే దయా వెబ్ సిరీస్‌లో తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. అనంతరం ఆమె బిగ్‌బాస్ షో ద్వారా మరింతగా పాపులారిటీ సాధించారు. దాదాపు టైటిల్ గెలుస్తుందా? అనేంతగా తన టాలెంట్‌ను చూపించి అభిమానులను సంపాదించుకొన్నారు.
అయితే ఇటీవల జబర్దస్త్ ఫేమ్ నిర్వహించే కిస్పిక్ టాక్ షోలో తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను చెప్పుకొచ్చారు. జీవితం చాలా నేర్పుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో చాలా కష్టాలు, ఇబ్బందులు పడ్డాను. డబ్బు కోసం రకరకాల పనులు చేశాను. అయితే తన కష్టాలను ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు. బాధ్యతలు భుజాన పడిన తర్వాత అందరూ వాటికి అనుగుణంగా మారిపోతారు అని విష్ణుప్రియ అన్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చే సమయంలో సొంత ఖర్చుల కోసం భగవద్దీత క్లాసులను పిల్లలకు చెప్పేదానిని. ఒక్కో స్టూడెంట్ నుంచి 500 రూపాయలు సంపాదించేదానిని. ప్రతీ వారాంతంలో మూడు వేల రూపాయలు వచ్చేవి. ఓ సమయంలో ఫిట్‌నెస్ కొరియోగ్రాఫర్‌గా కూడా పనిచేశాను. ఎన్ని కష్టాలు వచ్చినా డబ్బులను ఎవ్వరిని అడగలేదు. కానీ ఓసారి క్లిష్ట పరిస్థితిలో నా ఇగోను చంపుకొని డబ్బు కోసం చేయి చాపాల్సిన పరిస్థితి ఏర్పడింది అని విష్ణు ప్రియ అన్నారు.
నా తల్లికి ఆరోగ్య పరిస్థితి దారుణంగా క్షీణించడంతో హాస్పిటల్‌లో చేర్పించాల్సి వచ్చింది. ఆ సమయంలో లక్షలు లక్షలు ఖర్చు అయ్యాయి. ఆ సమయంలో చాలా మందిని డబ్బు అడిగాను. ఆ టైమ్‌లో నా గురించి తెలిసి జ్యోతిష్కుడు వేణుస్వామి సహాయం చేశారు. అయితే ఆయన వివాదాలు పక్కన పెడితే.. సాయం చేయడంలో చాలా ముందు ఉంటారు. డబ్బులు అవసరముంటాయని తాను ముందుకొచ్చి హెల్ప్ చేశారు. తనకు తెలిసిన వారెవరైనా కష్టాల్లో ఉంటే ఆయన ఆదుకొంటారు అంటూ వేణుస్వామి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


Click it and Unblock the Notifications











