పోర్చుగల్‌లో చిల్ అవుతోన్న విశ్వంభర హీరోయిన్ .. బ్రాండ్ చూపించి మరి..!
టాలీవుడ్‌కు దేశంలోని అన్ని ఏరియాల నుంచి హీరోయిన్లుగా ప్రతియేటా ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తుంటారు. కానీ ఈరోజుకి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో కన్నడ భామలదే డామినేషన్. నాటి సీనియర్ ఎన్టీఆ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎందరో కన్నడ అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌లుగా వెలుగొందారు. ప్రస్తుత తరంలో అనుష్క శెట్టి, రష్మిక మందన్న, కృతి శెట్టి , పూజా హెగ్డే, శ్రీలీల వంటి కన్నడ కస్తూరిలు టాలీవుడ్‌ను ఏలుతున్నారు. వీరి బాటలోనే తెలుగునాట స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆషికా రంగనాథ్.
5 ఏప్రిల్ 1996న కర్ణాటకలోని తుముకూరులో జన్మించారు ఆషికా రంగనాథ్. తల్లిదండ్రులు రంగనాథ్, సుధ ఈమెకు ఓ అక్క అనూష రంగనాథ్ ఉన్నారు. ఈమె కూడా శాండిల్‌వుడ్‌లో నటిగా దూసుకెళ్తున్నారు. బెంగళూరులోని జ్యోతి నివాస్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు కాంటెస్ట్ ఆడిషన్స్‌లో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు ఆషికా. ఈమె ఫ్రీ స్టైల్, బెల్లి, వెస్ట్రన్ డ్యాన్స్‌లో ప్రావీణ్యురాలు.

2016లో క్రేజీ బాయ్ అనే కన్నడ చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్ అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. మాస్ లీడర్, రాంబో 2, మదగజ, జేమ్స్, అవతార పురుష, గరుడ వంటి కన్నడ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2023లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తన అందంతో తెలుగు వారిని మెస్మరైజ్ చేశారు. ఆ వెంటనే టాలీవుడ్ అగ్ర కథనాయకుడు అక్కినేని నాగార్జున సరసన నటించే ఛాన్స్ కొట్టేసి విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు ఆషికా రంగనాథ్.
అటు తమిళంలోనూ అడుగుపెట్టి.. మిస్ యూ, సర్దార్ 2 చిత్రాల్లో నటించి కోలీవుడ్‌లో జెండా పాతారు. ఇటీవల సిద్ధార్థ్ సరసన ఆమె నటించిన మిస్ యూ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిరాశ పరిచినా ఆషికా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరలో ఆమెకు అవకాశం దక్కింది. ఇందులో మీనాక్షి చౌదరి, త్రిష, ఇషా చావ్లాలతో ఆషిక స్క్రీన్ చేసుకోనున్నారు.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆషికా రంగనాథ్.. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అలాగే ఖాళీ సమయాల్లో ఫారిన్‌కు వెళ్లడం ఆమెకు అలవాటు. తాజాగా కుటుంబంతో కలిసి యూరప్‌లోని పోర్చుగల్‌లో చక్కర్లు కొడుతున్నారు ఆషికా రంగనాథ్. అక్కడి ఫేమస్ టూరిస్ట్ ప్లేస్‌లను సందర్శించడంతో పాటు పోర్చుగల్‌లో దొరికే క్వాలిటీ వైన్‌ను ఆస్వాదించినట్లుగా తెలుస్తోంది. చేతిలో మద్యంతో ఉన్న గ్లాస్.. దాని పక్కనే బ్రాండ్ సీసాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











