'ఆ హీరోతో రొమాన్స్ చేయడం జీవితంలో అతిపెద్ద తప్పు.. వారం రోజులు అలాంటి నరకం'
లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు మీనాక్షి చౌదరి. ప్రస్తుతం దక్షిణాది డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా ఆమె నిలిచారు. సీనియర్ హీరోలకు, జూనియర్ హీరోలకు ఫేవరెట్ ఛాయిస్‌గా మీనాక్షి ఉన్నారు. గ్లామర్ రోల్స్ అయినా పర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలకైనా రెడీ అంటున్నారు ఈ డాక్టరమ్మ. అయితే ఓ సినిమా విషయంలో తాను తప్పు చేశానిన మీనాక్షి బాధపడుతున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
అవకాశాల కోసం ఇబ్బందిపడ్డ మీనాక్షి
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం తెగ ఇబ్బందిపడ్డారు మీనాక్షి చౌదరి. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో తిరిగి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసుకోవాల్సిందేనంటూ ఆమె ట్రోలింగ్ బారినపడ్డారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా ఎంపికైనా చివరి నిమిషంలో సెకండ్ హీరోయిన్‌గా, లేదంటే ప్రాధాన్యత లేని పాత్రలో నటించాల్సి వచ్చింది. అయినప్పటికీ తన టైం కోసం వెయిట్ చేసిన మీనాక్షి చౌదరికి గుంటూరు కారం నుంచి లైఫ్ మారిపోయింది. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ సూపర్‌స్టార్ ఇళయ దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో ఆమెది చిన్న రోలే అయినప్పటికీ ది గోట్ బ్లాక్‌బస్టర్ కావడంతో మీనాక్షికి సైతం మంచి పేరొచ్చింది.

రెండు హిట్స్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా
ఈ రెండు చిత్రాలతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన మీనాక్షి చౌదరికి అవకాశాలు క్యూకట్టాయి. వెంకీ అట్లూరి - దుల్కర్ సల్మాన్ కాంభినేషన్‌లో తెరకెక్కిన లక్కీభాస్కర్‌లో ఓ బాబుకి తల్లిగా నటించి తాను ఎలాంటి పాత్రలోనైనా నటించగలనని రుజువు చేసింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడిల సంక్రాంతికి వస్తున్నాంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో గ్లామర్ రోల్‌తో పాటు పోలీస్ డ్రెస్‌లో యాక్షన్ సీన్స్‌లోనూ నటించింది. వరుస హిట్స్‌తో చేతినిండా అవకాశాలతో దూసుకెళ్తున్నారు మీనాక్షి చౌదరి.
రెమ్యునరేషన్ పెంచేసిన మీనాక్షి?
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నట్లు రెమ్యునరేషన్‌ను కూడా మీనాక్షి పెంచేశారు. తొలుత కోటి రూపాయల లోపే పారితోషికం అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా రెండు కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభరలో ఆమె ఓ పాత్ర పోషిస్తున్నారు. అలాగే నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తోన్న అనగనగా ఒకరాజు చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసింది. తొలుత ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకోగా.. ఆమెను తప్పించి ఇప్పుడు మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. దీనితో పాటు అక్కినేని నాగచైతన్య 24వ చిత్రం NC24లోనూ మీనాక్షియే హీరోయిన్. ఇందులో ఆమె ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు.
వారం రోజులు డిప్రెషన్‌లోకి
అలా కెరీర్‌లో పీక్స్‌లో ఉన్న మీనాక్షి తాను ఓ సినిమా విషయంలో చేసిన తప్పుకు బాధపడుతున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇళయ దళపతి విజయ్‌తో తాను నటించిన ది గోట్ సమయంలో తన పాత్రపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి చూసి తాను ఎంతో బాధపడ్డానని.. వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లానని మీనాక్షి చౌదరి గుర్తుచేసుకున్నారు. ఈ ట్రోల్స్ వల్ల నేను ఎంచుకునే కథలు, సినిమాలపై మరింత ఫోకస్ పెట్టాలని అర్ధమైందని.. అప్పటి నుంచి నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న వాటినే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు మీనాక్షి వెల్లడించారు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











