స్పోర్ట్స్ బ్రాలో షాకిచ్చిన వితిక: వరుణ్ సందేశ్ భార్య అరాచకమైన హాట్ షో
టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు లభించడం లేదు. అయినప్పటికీ కొందరు భామలు ఎలాగోలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో భీమవరం చిన్నది వితిక షేరు ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే, హీరో వరుణ్ సందేశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత మాత్రం పెద్దగా అవకాశాలను అందుకోలేదు. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే వితిక.. తాజాగా ఓ హాట్ పిక్ వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

తెలుగు పిల్ల... అక్కడ ఎంట్రీ
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే వితిక షేరు మోడల్‌గా ఫుల్ పాపులర్ అయింది. ఇందులో తన అందచందాలతో మైమరపించిన ఈ భామ.. 'అంతు ఇంతు ప్రీతి బంతు' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. దీని తర్వాత కూడా 'ఉల్లాస ఉత్సాహ' అనే చిత్రంలో నటించింది. తద్వారా కన్నడంలో ఈ బ్యూటీ యమ పాపులర్ అయిపోయింది.

తెలుగులోకి.. వరుస మూవీలే
కన్నడంతో పరిచయమైన తెలుగు భామ వితిక 'ప్రేమించే రోజుల్లో' అనే చిత్రంతో తెలుగులోకి ఎంటరైంది. ఆ తర్వాత వరుసగా 'సందడి', 'జుమ్మంది నాదం', 'భీమిలి కబడ్డీ జట్టు', 'ప్రేమ ఇష్క్ కాదల్' వంటి చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే 'పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది.

వరుణ్‌తో పెళ్లి.. బిగ్ బాస్‌లో
'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమా సమయంలో హీరో వరుణ్ సందేశ్‌తో వితిక షేరు ప్రేమలో పడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత వీళ్లిద్దరూ బిగ్ బాస్ షోలోకి జంటగా ఎంట్రీ ఇచ్చారు. అందులో తరచూ ముద్దులు, హగ్గులు ఇచ్చుకునేవారు. ఇలా యమ పాపులర్ అయ్యారు. ఈ సీజన్‌లో వరుణ్ ఫినాలేలో అడుగు పెట్టినా వితిక మాత్రం నిరాశ పరిచింది.

మళ్లీ మొదలెట్టేసిన బ్యూటీ
ఆ మధ్య వరుసగా సినిమాలు చేసిన వితిక షేరు.. వివాహం తర్వాత మాత్రం పెద్దగా అవకాశాలను దక్కించుకోలేదు. కానీ, యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ను మాత్రం అలరిస్తూనే ఉండేది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితమే విడుదలైన 'పెళ్లిసందD' సినిమాలో వితిక షేరు కీలక పాత్రను చేసి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమెకు కాస్త అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్
నటిగా పరిచయం అయిన తర్వాత వరుస సినిమాలతో సందడి చేసిన.. వితిక షేరు సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి, తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

క్యూట్ లుక్స్‌తో కవ్విస్తూనే
ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినా వితిక షేరు పెద్దగా గ్లామర్ షో మాత్రం చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది అప్పుడప్పుడూ కొన్ని క్యూట్ అండ్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటుంది. ఈ మధ్య కొంచెం స్పీడు పెంచేసి రెచ్చిపోతోంది. ఫలితంగా వితిక క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

స్పోర్ట్స్ బ్రా పిక్ వదిలింది
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న వితిక షేరు.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రా వేసుకుని జాకెట్ విప్పేసి మరీ దర్శనమిచ్చింది. దీంతో వితిక అందాలు చూపరులకు బాగా కనువిందు చేస్తూ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి ఇది వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











