ఆ డైరెక్టర్ బట్టలు విప్పమన్నాడు: ముదిరిన తనుశ్రీ వివాదం, ఆ రోజు ఏం జరిగిందంటే?

Recommended Video

'Vivek Agnihotri Asked Me To Strip And dance' Says Tanu Sri Dutta

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో తనతో మిస్ బిహేవ్ చేశాడని, లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తా... 'చాకోలేట్' సినిమా సమయంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన అసిస్టెంట్లకు చెప్పి తన బట్టలు విప్పించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో తనుశ్రీ దత్తా ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు.

తనుశ్రీ దత్తా తనపై చేసిన ఆరోపణలను 'చాకొలేట్' మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఖండించారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండి పడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆమెపై పరువు నష్టం కేసు వేశానని, తన లాయర్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు.

ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన అసిస్టెంట్

ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన అసిస్టెంట్

కాగా... ‘చాకొలేట్' మూవీ షూటింగ్ జరిగే సమయంలో అసలు ఏం జరిగింది? ఆ రోజు ఆమెను దర్శకుడు బట్టలు విప్పమని ఎందుకు అన్నారు? అనే సంఘటన వివరిస్తూ ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన సత్యజిత్ గాజ్మర్ ఫేస్ బుక్‌లో ఓ పోస్టు పెట్టారు.

తనుశ్రీకి చెడ్డ అలవాటు ఉంది

తనుశ్రీకి చెడ్డ అలవాటు ఉంది

తనుశ్రీ దత్తాకు ఓ చెడ్డ అలవాటు ఉందని, షూటింగ్ సమయంలో తన కారావాన్ నుండి తరచూ మాయం అయ్యేది. ఎక్కడికి వెళ్లేదో తెలియదు... లేటుగా షూటింగుకు వచ్చేది. ఆమె మూలంగా సెట్లో అందరూ ఇబ్బంది పడేవారు. షూటింగ్ సమయంలో కూడా చాలా టేక్స్ తీసుకునేవారు అని సత్యజిత్ వెల్లడించారు.

ఆ రోజు తడిచిన బట్టల్లో సీన్

ఆ రోజు తడిచిన బట్టల్లో సీన్

ఓ సారి ఆమెపై తడిచిన బట్టల్లో ఉండే సీన్ చిత్రీకరిస్తున్నాం. ఆ సమయంలో మామూలు బట్టలు విప్పేయాలని, కేవలం ఆ సీన్‌కు అవసరమైన చిన్న దుస్తులు మాత్రమే ఉండాలి సూచించారు. ఆమె ఎక్కువ టేక్స్ తీసుకుంటుండటంతో సమయం వేస్ట్ అవ్వకుండా ఆ చిన్న దుస్తుల్లోనే ఉండాలని, టేక్ పూర్తవ్వగానే వెంటనే ఆమె శరీరాన్ని బాత్‌రోబ్‌తో కప్పేలా లేడీ అసిస్టెంట్లను పెట్టి ఏర్పాట్లు చేశామని తెలిపారు.

 అందరి ముందు బట్టలు విప్పాలని ఎవరూ చెప్పరు

అందరి ముందు బట్టలు విప్పాలని ఎవరూ చెప్పరు


మేము ఇప్పటి వరకు ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్, యాడ్ ఫిల్మ్స్, సినిమాలు చేశాం. సెట్స్‌లో వందల మంది పని చేస్తుంటారు. ఇలాంటి సీన్లు చిత్రీకరించేపుడు హీరోయిన్లు ఇబ్బంది పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు. అందరి ముందు బట్టలు విప్పేయాలని ఎవరూ చెప్పరు. వారికి రక్షణగా లేడీ అసిస్టెంట్లు, ఇతర లేడీ టెక్సిషిన్లు ఉంటారు. వారు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తనుశ్రీ దత్తా చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు అన్నారు.

ఇలా రాయడం దారుణం

ఇలా రాయడం దారుణం


కొన్ని మీడియా సంస్థలు కూడా తనుశ్రీ చెప్పగానే అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా దాన్ని సెన్సేషన్ చేయడానికి ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. ఇలాంటి సంస్థల వల్ల జర్నలిజం విలువ పడిపోతుంది అని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మద్దతుదారులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X