For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రుతి హాసన్ కి మానసిక సమస్యలు?, చిరంజీవి ఫంక్షన్ నుంచి మొదలు.. బ్యూటి పోస్ట్ వైరల్!

  |

  యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ తనదైన శైలీలో మంచి గుర్తంపు తెచ్చుకుంది. ముందుగా సింగర్ గా కెరీర్ ప్రారంభించిన బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ తర్వాత నటిగా మారింది. లక్ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్ తెలుగులో సిద్ధార్థ్ నటించిన అనగనగా ఓ ధీరుడు మూవీతో పరిచయం అయింది. తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచిన రెండు బడా సినిమాల్లో హీరోయిన్ గా సత్తా చాటింది. అయితే ఇటీవల శ్రుతి హాసన్ కు మానసిక సమస్యలు అంటూ వార్తలు తెగ హైలెట్ అయ్యాయి.

  కలిసి రాని మొదటి చిత్రాలు..

  కలిసి రాని మొదటి చిత్రాలు..

  యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది గ్లామరస్ బ్యూటి శ్రుతి హాసన్. అయితే తెలుగులోఅనగనగా ఓ ధీరుడు సినిమాతో.. హిందీలో లక్ మూవీతో అడుగు పెట్టిన శ్రుతి హాసన్ కు ఆ సినిమాలు అంతగా కలిసి రాలేదు.

  కానీ తర్వాత రానురాను తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అగ్ర హీరోలతో ఆమె నటించిన సినిమాలన్ని దాదాపుగా సూపర్ హిట్ సాధించాయి. అయితే తర్వాత సినిమాలకు కొంతకాలం గ్యాప్ తీసుకుంది ఈ ముద్దుగుమ్మ.

  ఇద్దరు పెద్ద స్టార్ హీరోలతో..

  ఇద్దరు పెద్ద స్టార్ హీరోలతో..

  టాలీవుడ్‌లోకి ఈ మధ్యనే రీఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'సలార్‌' అనే సినిమాను చేస్తోంది. అలాగే బాలకృష్ణ-గోపీచంద్ కాంబినేషన్‌లోని వీర సింహా రెడ్డి, చిరంజీవి-బాబీ కాంబోలోని వాల్తేరు వీరయ్య సినిమాలోను శ్రుతి హాసనే హీరోయిన్. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన రెండు పెద్ద హీరోల సినిమాల్లో శ్రుతి హాసనే హీరోయిన్ గా చేయడం విశేషం.

  మైత్రీ మూవీ మేకర్స్ కావడం..

  మైత్రీ మూవీ మేకర్స్ కావడం..

  అంతేకాకుండా ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ నటించిన తాజా సినిమాలకు ఒకటే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే ఇటీవల ఒంగోలులో అట్టహాసంగా జరిగిన బాలకృష్ణ వీర సింహా రెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి మాత్రం శ్రుతి హాసన్ హాజరు కాలేదు.

  ఒంగోలులో ఏం తినిందో..

  ఒంగోలులో ఏం తినిందో..

  జనవరి 8న విశాఖపట్నంలో గ్రాండ్ గా జరిగిన చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రుతి హాసన్ రాకపోవడంతో అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే వాటన్నికంటే ముందుగానే శ్రుతి హాసన్ తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని పోస్ట్ కూడా పెట్టింది. అదే విషయాన్ని వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి కూడా చెప్పుకొచ్చారు. ఒంగోలులో ఏం తినిందో.. ఎవరు బెదిరించారో అని సరదగా చమత్కరించారు.

  చిరంజీవి పంక్షన్ కి..

  చిరంజీవి పంక్షన్ కి..

  ఇదిలా ఉంటే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనారోగ్య కారణంతో శ్రుతి హాసన్ రాకపోవడంపై అనేక రూమర్స్ గింగిరాలు తిరిగాయి. శ్రుతి హాసన్ కు మానసిక సమస్యలు ఉన్నాయని, వాటని నయం చేసేందుకు విదేశాల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటుందని రకరకాల వార్తలు వివిధ వెబ్ సైట్లలో వచ్చాయి. ఈ వార్తలన్నీ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోవడంతోనే మొదలయ్యాయి.

  మీరే థెరపిస్ట్ ను కలవండి..

  ఈ వార్తలపై తాజాగా శ్రుతి హాసన్ స్పందించింది. తనపై వచ్చిన రూమర్స్ ఆర్టికల్స్ షేర్ చేస్తూ.. "నాకు వచ్చిన జ్వరం ఇలా మారిందా అని ఒక ట్వీట్ లో రాసుకొచ్చింది. మరొక ట్వీట్ లో ఇదన్న మాట సంగతి. మెంటల్ హెల్త్ వంటి సమస్యలపై మాట్లాడేందుకు భయపడే వాటిపై ఎంత డ్రామా. నేను ఎప్పుడు మెంటల్ హెల్త్ కు అడ్వకేట్ ని. అన్ని రకాలుగా నన్ను నేను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. అన్నట్లు నాకు వచ్చింది వైరల్ ఫీవర్. కాబట్టి బాగా ట్రై చేశారు. ఇప్పుడు మీకు ఏమైందో తెలుసుకోండి. దయచేసి ఒక మంచి థెరపిస్ట్ ను కలవండి" అని శ్రుతి హాసన్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.

  English summary
  Shruti Haasan About Mental Issues On Her For Not Attending Chiranjeevi Waltair Veerayya Pre Release Event At Vizag On January 8.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X