twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    50ఏళ్లు వచ్చేసరికి డబ్బున్న వారి జాబితాలోకి చేరతా - కంగనా

    |

    ఎప్పటికప్పుడు సరికొత్త అంశంతో వార్తలకు ఎక్కడం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు వెన్నతో పెట్టిన విద్య. మొన్నామధ్య అక్క రంగోలికి బాసటగా నిలుస్తూ, భారత్ లో ట్విట్టర్ ను బ్యాన్ చేయమని నేరుగా ప్రధాని మోడీనే ఉద్దేశిస్తూ ఓ సందేశం విడుదల చేసిన ఈ రివాల్వర్ రాణి, ఈ మధ్యే ముంబైలోని పాలి హిల్స్ లో తన ఖరీదైన ఆఫీస్ ను ఓపెన్ చేసి మరోసారి అందరినీ ఆశ్చర్యపరచింది. తాజాగా అమ్మడు తన కెరీర్ లోని గెలుపోటములను గుర్తుచేసుకుంటూనే.. భవిష్యత్తు ప్రణాళికలను కూడా వివరించింది.

     పెద్ద ఆలోచనలు లేవు

    పెద్ద ఆలోచనలు లేవు

    చేతిలో కేవలం రూ.1500లతో ఇంటి నుంచి పారిపోయిన కంగనా, ఎన్నో పోరాటాల అనంతరం తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంది. ఇన్నేళ్లలో సామాజిక రుగ్మతలు తన మనసుపై, తన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపాయో వెల్లడించింది. తాను ఇంతవరకూ వస్తాననే అనుకోలేదని తెలిపిన కంగన, అసలు ఇంత పెద్ద ఆలోచనలు కూడా అప్పుడు లేవని స్పష్టం చేసింది.

    అమ్మాయి డబ్బు కోసం ఆశపడితే అంతే...!

    అమ్మాయి డబ్బు కోసం ఆశపడితే అంతే...!

    డబ్బు సంపాదించడం గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పిన కంగన, ఈ సమాజంలో ఆడవాళ్లు డబ్బుసంపాదనపై దృష్టిపెట్టడాన్ని జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని వెల్లడించింది. ఇది పురుషుల రేస్ అని తెలిపిన కంగన, ఒక ఆడదానిగా ఎంతో ఆవేదన చెందానని చెప్పింది. కానీ అదే తన జీవిత గమనాన్ని మార్చిందని, తన ఆలోచనా విధానం కూడా మారిపోయిందని తెలిపింది. ఇప్పుడు అదే తన లక్ష్యమని వెల్లడించింది.

    Recommended Video

    Star Heros Special Target On Dussehra Holidays
     50ఏళ్లకు దేశంలో అత్యంత ధనవంతురాలునవుతా

    50ఏళ్లకు దేశంలో అత్యంత ధనవంతురాలునవుతా

    క్రమంగా తన దిశానిర్దేశాలు, లక్ష్యాలు మారాయని తెలిపిన కంగన, జనాలు ఎంతగా తనను వ్యతిరేకిస్తే అంతగా పైకి ఎదుగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఊరు నుంచి వచ్చిందని తనను ఎన్ని మాటలు అన్నా పట్టించుకోలేదని, పైగా ఆ మాటనే తనలో కసిని రేపాయని తెలిపింది. 50ఏళ్లు వచ్చేసరికి దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలోకి చేరడమే తన ప్రస్తుతం లక్ష్యమని స్పష్టం చేసింది. ఇటీవలే ముంబైలో తన కొత్త ఆఫీస్ ను ప్రారంభించిన కంగన, ఈ భవంతిపై రూ. 48కోట్లు వెచ్చించిందన్న సంగతి తెలిసిందే.

    English summary
    Actress Kangana Ranaut pours her heart out, on how she battled her way throught social judgment all her career. And how the fight has changed her life along with her ambitions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X