War 2: బికినీ సీన్ కోసం కియారా తంటాలు.. కడుపు మార్చుకొని అందాల ఆరబోత
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో వార్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అషుతోష్ రాణా, అనిల్ కపూర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రీతం సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వార్ 2 చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
హాట్ టాపిక్‌గా కియారా బికినీ షో
ఈ సినిమాలో కియారా అద్వానీ లుక్, ఆమె బికినీ షో గురించి ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్లలో కియారా బికినీ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. గతంలో గ్లామర్ షో చేసినప్పటికీ వార్ 2లో మాత్రం అంతకుమించి పరువాల విందు చేసిందని కామెంట్స్ పెడుతున్నారు. అయితే దీనిపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఒరిజినల్ ఫుటేజ్ కాదని, సీజీ వర్క్ అంటూ రూమర్స్ వైరల్ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ ఘాటుగా స్పందించింది.

రూమర్స్‌కు చెక్ పెట్టిన యూనిట్
ఈ మేరకు బిహైండ్ దీ సీన్స్ పేరుతో వీడియో రిలీజ్ చేశారు. అలాగే కియారా అద్వానీ బికినీ సీన్ కోసం ఎలా రెడీ అయ్యారో కూడా చూపించారు. దాంతో నెటిజన్ల నోళ్లు మూతపడటంతో పాటు కియారా ఎంత కష్టపడ్డారో అర్ధం చేసుకున్నారు. ఈ వివాదానికి తెరపడగా.. ఇంత కష్టపడినప్పటికీ వార్ 2 యూనిట్‌కు సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. కియారా అద్వానీ బికినీ సీన్‌కు కట్ చెప్పింది. సీబీఎఫ్‌సీ ఆదేశాల మేరకు 9 సెకన్ల సెన్సువల్ విజువల్స్‌ను 50 శాతం మేర తగ్గించినట్లుగా బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. వార్ 2 టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఉపయోగపడటమే కాకుండా సినిమాకు హైప్ తీసుకొచ్చిన ఈ బికినీ సీన్‌కు కట్ చెప్పడంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.
షార్ట్ కట్‌లు లేని డైట్
ఏది ఏమైనప్పటికీ కియారా అద్వానీ కష్టాన్ని మాత్రం తక్కువగా చూడలేం. తాజాగా వార్ 2 కోసం, మరీ ముఖ్యంగా బికినీ సీన్ కోసం కియారా ఎంత కష్టపడ్డారో వివరించారు ఆమెకు న్యూట్రిషన్‌గా పనిచేసిన వ్యక్తి. 'నాజూకైన శరీరం కేవలం అందరికీ సాధ్యం కాదు. ఇది నెలల తరబడి అత్యంత కఠినమైన డైట్, దృఢమైన ఫిట్నెస్ వల్లే సాధ్యం. వార్ 2 కోసం కియారా ప్రిపరేషన్ కోసం నాతో మాట్లాడినప్పుడు ఆమె టార్గెట్ ఏంటో క్లియర్‌గా ఉంది. స్క్రీన్‌పై తొలి బికినీ షాట్ కోసం శరీరాన్ని సిద్ధం చేయడానికి షార్ట్ కట్‌లు, క్రాష్ డైట్‌లు కియారా వద్దన్నారు ' అని న్యూట్రిషనిస్ట్ చెప్పారు.
కియారా డైట్‌పై న్యూట్రిషనిస్ట్ ప్రశంసలు
'అల్పాహారంతో కియారా అద్వానీ రోజు ప్రారంభించేవారు. ఓట్, వాల్ నట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, మాంక్ ఫ్రూట్, మాపుల్ సిరప్, నీరు, తాజా బెర్రీలు, హాజెల్ నట్ బటర్‌తో చేసిన ప్రోటీన్ పాన్ కేక్‌లు తీసుకునేవారు. ఇది కియారా ఫేవరెట్ ఫుడ్. యూరోప్‌లో షూట్‌కు బయల్దేరే ముందు కియారా టీమ్ దీని తయారీ ప్రక్రియను కూడా షూట్ చేసింది. ఆమె భోజనంలో ఖచ్చితంగా లీన్ ప్రోటీన్, గ్రిల్డ్ చికెన్, లైట్ కర్రీలు, అవకాడో, ఎడామామ్, కూరగాయాలతో చేసిన హమ్మస్ తీసుకునేవారు. భోజనం సంగతి పక్కనపెడితే.. శరీరానికి రెస్ట్ చాలా ముఖ్యం. వేళకు భోజనం, ట్రైనింగ్, నిద్రను కియారా సమన్వయం చేసేవారు. ఈ డైట్ విషయంలో కియారా అద్వానీ అంకితభావం, క్రమశిక్షణ ప్రశంసనీయమని' న్యూట్రిషనిస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కియారా అద్వానీ కష్టాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











