మాధురీ దీక్షిత్‌కు రెండు బ్రేకప్స్.. సంజయ్ దత్ జైలుకు.. మరో లవర్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో! ఆ క్రికెటర్ ఎవరంటే?

బాలీవుడ్‌ను తన అందం, అభినయం, డ్యాన్సులతో ఊపేసిన హీరోయిన్లలో మాధురీ దీక్షిత్ ఒకరంటే ఎలాంటి అనుమానం లేదు. దాదాపు రెండు దశాబ్దాలపాటు బాలీవుడ్‌లో రాణించి అగ్రతారగా నిలిచిపోయింది. అయితే ఆమె స్టార్ హీరోయిన్‌గా సినీ తెరను ఏలుతున్న సమయంలో పలువురు హీరోలు, క్రికెటర్లతో ఆమె అఫైర్ వార్తలు మీడియాలో ప్రముఖంగా కనిపించేవి. అయితే ప్రముఖ క్రికెటర్‌తో మాధురి కొనసాగించిన డేటింగ్ వ్యవహారం కొద్ది మందికే తెలుసు. ఆ క్రికెటర్ ఎవరు? మాధురి జీవితంలో ఎలాంటి పాత్రను పోషించాడనే వివరాల్లోకి వెళితే..

తేజాబ్ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా

తేజాబ్ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా


మాధురీ దీక్షిత్ కెరీర్ విషయానికి వస్తే.. తేజాబ్ సినిమాలో ఏక్ దో తీన్ అనే పాటతో పరిచయమై ఓవర్‌నైట్‌లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఖల్ నాయక్, సాజన్, హమ్ ఆప్కే హై కౌన్, దిల్ తో పాగల్ హై, దిల్, రాజా, బేటా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది.

ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకొని

ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకొని


అయితే బాలీవుడ్‌లో అగ్రతారగా కొనసాగుతుండగానే మాధురీ దీక్షిత్ తన కెరీర్‌ నుంచి తాత్కాలికంగా తప్పుకొన్నారు. డాక్టర్ శ్రీరాం నేనే అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. ఆ తర్వాత అరిన్, ర్యాన్ అనే పిల్లలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత మళ్లీ వినోద పరిశ్రమలో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే శ్రీరామ్ నేనేతో పెళ్లికి ముందు ఆమె బ్రేకప్స్ వ్యవహారాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

అజయ్ జడేజాతో అఫైర్

అజయ్ జడేజాతో అఫైర్


అయితే ఓ యాడ్ షూట్ కోసం క్రికెటర్ అజయ్ జడేజాను మాధురీ దీక్షిత్ కలిసింది. ఆ పరిచయం వారిని దగ్గరకు చేర్చింది. ఆ సమయంలో వర్ధమాన తారగా రాణిస్తున్న మాధురీని అజయ్ జడేజా పలువురు నిర్మాతలకు సిఫారసు చేసి అవకాశాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారనే విషయం అప్పట్లో గుప్పుమన్నది. అయితే వారిద్దరి మధ్య ప్రేమ బలపడుతున్న సమయంలో ఊహించని సంఘటన జరిగింది.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజయ్ జడేజా

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజయ్ జడేజా


మాధురీ దీక్షిత్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి పెళ్లి గురించి ఆలోచిస్తున్న సమయంలో అజయ్ జడేజా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కొన్నారు. అజయ్ జడేజాపై సుప్రీంకోర్టు ఐదేళ్ల బహిష్కరణ విధించింది. వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడటం, కేసులు, రకరకాల ఆరోపణలు రావడంతో ప్రేమకు దూరమయ్యారు. మాధురీ కూడా అజయ్ జడేజాకు దూరమైందని సినీ, క్రీడా పండితులు చెప్పుకొంటారు.

అజయ్ జడేజా కంటే ముందు సంజయ్ దత్

అజయ్ జడేజా కంటే ముందు సంజయ్ దత్


అజయ్ జడేజాతో అఫైర్ బ్రేకప్‌కు ముందు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు మాధురీ దీక్షిత్ దగ్గరైంది. ఖల్ నాయక్, సాజన్ లాంటి సినిమాల్లో కలిసి పనిచేయడం వల్ల వారిద్దరి మధ్య అఫైర్ మరింత ముదిరింది. ఓ దశలో వారిద్దరూ పెళ్లి చేసుకొందామని అనుకొన్న సమయంలో సంజయ్ దత్ ముంబై బాంబు పేలుళ్ల కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అలా మాధురీ దీక్షిత్ జీవితంలో ఇద్దరితో అఫైర్ అలా బ్రేకప్ అయింది.

మాధురీ లవర్స్‌కు జీవితంలో మాయని మచ్చ

మాధురీ లవర్స్‌కు జీవితంలో మాయని మచ్చ


మాధురి దీక్షిత్‌తో అఫైర్ సాగించిన ఇద్దరు ప్రముఖుల జీవితాలపై మాయని మచ్చలు పడ్డాయి. అందులో ఒకరు సంజయ్ దత్ చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపితే.. అజయ్ జడేజాకు మాత్రం జైలుకు వెళ్లిన పనైంది. అయితే ఈ రెండు సంఘటనలు మాధురీ దీక్షిత్ జీవితంలో చోటు చేసుకోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X