రక్తం కారేలా హీరోయిన్ పెదవి కొరికిన స్టార్ హీరో.. డైరెక్టర్ కట్ చెప్పినా లిప్‌లాక్‌తోనే!
ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచాలనే డైరెక్టర్, నిర్మాతల తాపత్రయం హీరో, హీరోయిన్లకు రకరకాలుగా కష్టాలు తెచ్చిపెడుతుంది. సన్నివేశాన్ని పండించేందుకు హీరోయిన్లు వానలో తడిచి.. మండుటెండలో ఎండి ఆడియెన్స్‌ను రంజింప చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో వారికి కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొనడం సహజంగా జరుగుతుంది. ఓ స్టార్ హీరోయిన్‌ను దారుణమైన అనుభవాన్ని మిగిల్చిన హీరోకు సంబంధించిన విషయంలోకి వెళితే..
ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన తమిళ చిత్రం నాయకన్. కమల్ హాసన్, శరణ్య హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ విజయం అందుకొన్నది. ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల మధ్య శృంగార సన్నివేశాలు చాలా హోమ్లీగా, హెల్తీగా ఉంటాయి. ఆ సినిమాను దయావన్ అనే పేరుతో హిందీలోకి రీమేక్ చేశారు. ప్రముఖ నటుడు, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, అప్పటి అగ్రహీరో వినోద్ ఖన్నా, అప్పటి యువ తార మాధురీ దీక్షిత్ హీరోయిన్లుగా నటించారు.

దయావన్ సినిమాలోని ఓ రొమాంటిక్ సీన్‌ను దర్శకుడు ఫిరోజ్ ఖాన్ షూట్ చేస్తున్నారు. ఆ సన్నివేశంలో హీరో, హీరోయిన్లు వినోద్ ఖన్నా, మాధురీ దక్షిత్ నటిస్తున్నారు. ఫుల్ రొమాంటిక్ సీన్‌ను రక్తి కట్టించేందుకు మాధురీ కూడా రెడీ అయ్యారు. ముద్దు సీన్‌లో ఇద్దరు లిప్‌లాక్ చేసుకొన్నారు. షాట్ బాగా రావడంతో దర్శకుడు సంతృప్తితో కట్ చెప్పారు. కానీ దర్శకుడి మాటలు వినిపించుకోకుండా మాధురి పెదవులను తన పెదవులతో బిగించేశాడు. దాంతో మాధురీ తీవ్ర అసౌకర్యానికి గురైందట.
అయితే తన కంటే 20 ఏళ్ల వయసులో చిన్నదైన మాధురీ దీక్షిత్ పెదవిని అలాగే 5 నిమిషాలపాటు పట్టుకొనే ఉన్నాడట. ఆమె పెదవిని గట్టిగా కొరకడంతో ఆమె రక్తం కారిపోయింది. ఆ బాధను భరించలేక భోరున విలపించింది. షాట్ పూర్తి కాగానే తన గదిలోకి వెళ్లి బాధతో విలవిలలాడింది. అయితే తన తప్పును తెలుసుకొన్న వినోద్ ఖన్నా ఆ తర్వాత మాధురీకి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం కొంత సద్దుమణిగింది అని బాలీవుడ్ మీడియా కథనాల ద్వారా తెలిసింది.
అయితే ఈ వివాదం తర్వాత దయావన్ సినిమాలోని ఆ లిప్‌లాక్ సీన్‌పై రచ్చ జరగడంతో ఆ సన్నివేశాన్ని తొలగించాలని లీగల్ నోటీసులు పంపారు. అయితే మాధురీ దీక్షిత్ కూడా ఆ సీన్‌ను తొలగించాలని దర్శక, నిర్మాతను అభ్యర్థించింది. అయితే ఆ సీన్ తొలగించకుండా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఈ సీన్‌ను సినిమాలో చూసి మాధురీ షాక్ గురైందట. తాను కోరినప్పటికీ సన్నివేశాన్ని తొలగించలేదని బాధపడిందని బాలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.
దయావన్ సినిమా 1988 సంవత్సరంలో భారీగా రిలీజైంది. ఈ సినిమాను సుమారుగా 2.5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఫీరోజ్ ఖాన్ రూపొందిస్తే.. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మాధురీ దీక్షిత్ గ్లామర్, హాట్ హాట్‌గా నటించిన తీరుకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ సినిమాతో మాధురీ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకొన్నది.


Click it and Unblock the Notifications











