Throwback of Ramya హీరోయిన్ రమ్య ఆత్మహత్య చేసుకోవాలనుకొందా? రాహుల్ గాంధీ వల్లే..!

కన్నడ స్టార్ హీరోయిన్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత రమ్య అలియాస్ దివ్య స్పందన మరణ వార్త రూమర్ సినీ, రాజకీయ వర్గాలను కుదిపేసింది. తమిళ పీఆర్వో తప్పుడు సమాచారంతో చేసిన ట్వీట్ సోషల్ మీడియా హీటెక్కించింది. రమ్య ఇక లేరు.. గుండెపోటుతో మరణించారనే ట్వీట్ సోషల్ మీడియాలో ఆమె అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. దాంతో రమ్య వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం ట్రెండింగ్‌లో వచ్చాయి. తన జీవితానికి సంబంధించిన ఓ వార్త మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

రమ్య కొద్ది నెలల క్రితం కన్నడలో ఓ రియాలిటీ షోలో అతిథిగా పాల్గొన్నారు. ఆ టాక్ షోలో తన జీవితంలోని చీకటి వెలుగులు, కష్టసుఖాలను పంచుకొన్నారు. నా ప్రాణం కంటే ఎక్కువగా భావింే నా తండ్రి మరణం నన్ను తీవ్రమైన డిప్రెషన్‌కు గురి చేసింది. ఆ మానసిక క్షోభ నుంచి బయటపడటానికి శతవిధాలుగా ప్రయత్నించాను. అయినా ఆ బాధ నుంచి బయటకు రావడానికి సాధ్య పడలేదు అని రమ్య చెప్పారు.

 Rahul Gandi

పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన రెండు వారాలతో నా జీవితం తీవ్రమైన కుదుపుకు లోనైంది. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న సమయంలో నా తండ్రి ఆర్టీ నారాయణ్ మరణించారు. దాంతో నా ప్రపంచమంతా చీకటిగా మారిపోయింది. ఏం చేయాలో తెలియదు అని రమ్య చెప్పారు.

నా కెరీర్, పాలిటిక్స్ విషయాల్లో గైడెన్స్ విషయంలో నా తండ్రి తప్ప నాకు పెద్దగా తెలియదు. నా తండ్రి లేకపోవడంతో నేను స్వయంగా అన్నీ నేర్చుకొన్నాను. నా తండ్రి మరణానికి సంబంధించిన బాధను మరిచపోవడానికి పనిపై దృష్టిపెట్టాను. మాండ్య ప్రజలు నాలో ఆత్మవిశ్వాసానని నింపారు అని రమ్య తన ఇంటర్వ్యూలో చెప్పారు.

 Rahul Gandi

నా తండ్రి మరణం తర్వాత మానసికంగా ధైర్యం కోల్పోయాను. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాను. కొన్నిసార్ల ఆ బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన చేశాను. అలాంటి సమయంలో నాకు రాహుల్ గాంధీ అండగా నిలిచారు. నాకు ఎమోషనల్ సపోర్టు ఇచ్చారు. పార్టీలో కీలక స్థానం కల్పించారు. దాంతో నా బాధ నుంచి బయటపడేందుకు సాధ్యమైంది అని రమ్య చెప్పారు.

 Was Rahul Gandi saved Heroine Ramya When She Thought of suicide after fathers death?: throwback story of Ex MP

నా జీవితంపై నా తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నా తండ్రి ఇష్టపడుతాను. నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసిన మూడో వ్యక్తి రాహుల్ గాంధీ. నా తండ్రి చనిపోయిన తర్వాత సూసైడ్ ఆలోచనలు నా మదిలో మెదిలినప్పుడు రాహుల్ గాంధీ మానసిక స్థైర్యాన్ని నింపారు. అందుకే నేను ఇంకా బతికి ఉన్నాను అని అన్నారు.

 Rahul Gandi

మాజీ ఎంపీ, హీరోయిన్ రమ్య జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మండ్యాకు చెందిన ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తల్లి రంజిత కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. తండ్రి ఆర్టీ నారాయణ్ పారిశ్రామిక వేత్త. 2013లో జరిగిన ఉప ఎన్నికలో మాండ్య పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించింది. ఆతర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైంది. సినీ నటిగా పునీత్ రాజ్‌కుమార్ నటించిన అభి సినిమాతో 2003లో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కుత్తు, ఆకాశ్, గౌరమ్మ, అమృతధార, జూలీ, తానమ్ తానమ్, క్రేజీ లోక, ఆర్యన్, నాగదహవు సినిమాలో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X