భూతశుద్ది వివాహమంటే ఏమిటి? సమంత ఎందుకు ఈ పద్దతిలో పెళ్లి చేసుకొందో తెలుసా?
తెలుగు మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా కొద్ది నెలలుగా సమంత రుత్ ప్రభు డేటింగ్ వ్యవహారం, రెండో పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అదిగో డేటింగ్.. ఇదిగో పెళ్లి అంటూ ఆమె వ్యక్తిగత జీవితంపై మీడియా, సోషల్ మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టాయి. అలాంటి వార్తలకు ఇక ముగింపు పలికేలా డిసెంబర్ 1వ తేదీ 2025 సంవత్సరం రోజున సమంత తాను కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో మూడు మూళ్ల బంధాన్ని వేసుకొని.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
అయితే తమ మతాచారాలకు భిన్నంగా ఈ వివాహం జరగడం అత్యంత భారీ చర్చకు దారి తీసింది. ఈ పెల్లి వెనుక విశిష్టత ఏమిటి? ఈ పెళ్లి ఆచారం ఏమిటి? అనే విషయం గురించి నెటిజన్లు, సాధారణ ప్రేక్షకులు ఆసక్తిగా శోధించడం మొదలుపెట్టారు. ఆ ఆచార, సంప్రదాయ పెళ్లి వివరాల్లోకి వెళితే..

సమంత తొలి పెళ్లి విషయానికి వస్తే.. గోవాలో మొదటగా హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగింది. ఆ తర్వాత క్రిస్టియన్ వివాహ పద్దతిలో నిర్వహించారు. అయితే ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగకుండానే అర్ధాంతరంగా ప్రయాణం ముగిసింది. అందుకు గ్రహస్థితి, పంచభూతాల శుద్ది లేకపోవడ వల్లే అనే విషయాన్ని జ్యోతిష్యులు వెల్లడించారు. తాజాగా ఇషా ఫౌండేషన్‌లో కొనసాగుతున్న భూతశుద్ది క్రతువు ద్వారా సమంత, రాజ్ నిడిమోరు కొత్త జీవితాన్ని ఆరంభించారు.
ఇషా యోగా ఫౌండేషన్‌లో కొన్నేళ్లుగా కొనసాగుతున్న వివాహ పద్దతి భూతశుద్ది. భారతీయ సంప్రదాయ విధానంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. బంధాల, వైవాహిక బంధాలకు ఉండే దోషాలను ముందే తొలగించి.. గాఢమైన అనుబంధాన్ని దంపతుల మధ్య ఏర్పరిచే ఓ ట్రెడిషినల్ మ్యారేజ్ సిస్టమ్‌గా పేర్కొంటున్నారు.

దేశంలోని లింగ భైరవి ఆలయాల్లో ఈ తరహా వివాహాలను జరిపిస్తారు. ఇషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో ఇలాంటి వివాహా ఆచారాలను కొనసాగిస్తున్నారు. ఈ పవిత్రమైన క్రతువు నూతన వధూవరుల దేహాల్లోనే పంచభూతాలను శుద్ది చేస్తారు దాంతో వారిలో సామరసయం, స్పిరుచువాలిటీ, దాంపత్య జీవితంపై సానుకూల దృక్పథం ఏర్పడుతుందని బలంగా విశ్వసిస్తారు. ఈ పూజను జరిపించడం ద్వారా కొత్త దంపతులకు దేవీ అనుగ్రహం లభిస్తుంది అని చెప్పుకొంటారు.
హిందూ సంప్రదాయ వివాహ వ్యవస్థలో ఈ క్రతువు సమయంలో ఉచ్చరించే మంత్రాలు వల్ల మనసు ప్రశాంతత, శక్తియుక్తులు సానుకూలంగా మారుతాయి. దాంపత్య జీవితంలో సానుకూలమైన ఫలితాలు అందిస్తాయి. దంపతుల మధ్య గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది అని హిందూ పండితులు చెబుతుంటారు.


Click it and Unblock the Notifications











