What is Labubu Doll? ట్రెండింగ్‌లో లబుబు డాల్.. వింబుల్డన్‌లో ఊర్వశి రౌటేలాను ట్రోల్ ఎందుకు చేశారంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న అందాల రాక్షసి లబుబు. ఇండియన్ సెలబ్రిటీలు, ఇంటర్నేషనల్ హీరోయిన్లు అందరూ ఇప్పుడు లబుబు మోజులో పడ్డారు. ఎవరి డిజైనర్ బ్యాగ్ వైపు చూసినా.. ఎవరి కారులో చూసినా ఈ బొమ్మే ప్రత్యక్షమవుతున్నది. గత వారం రోజుల్లో ఈ క్రేజ్ ఎంత పెరిగిందంటే.. లండన్ వింబుల్డన్‌లో అత్యంత క్రేజీ అంశంగా మారింది. సినీ తారలే కాకుండా సాధారణ జనం కూడా ఈ బొమ్మను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఈ బోమ్మ ఏంటి? లబుబును క్రియేట్ చేసింది ఎవరు? ఈ బొమ్మను ఎందుకు మోస్తున్నారు? అనే వివరాల్లోకి వెళితే..

హాంకాంగ్ ఆర్టిస్ట్ కాసింగ్ లంగ్ రూపకల్పన
లబుబు డాల్.. ఇప్పుడు ఎవరి నోట, ఎవరి సోషల్ మీడియా అకౌంట్‌లో సెలబ్రిటీలను చూసినా ఈ బొమ్మను పట్టుకొని తిరుగుతున్నారు. ఈ ట్రెండింగ్ డాల్‌ను హాంకాంగ్‌‌కు చెందిన ఆర్టిస్టు కాసింగ్ లంగ్ క్రియేట్ చేశారు. మిస్టరీ బాక్స్‌లో అందంగా ప్యాక్ చేసి పాప్ మార్ట్‌లో ఈ మాన్‌స్టర్ బొమ్మను లాంచ్ చేశారు. దాని శరీరాకృృతి చూస్తే నార్మల్ సైజ్ కంటే పెద్దగా చెవులు, వంకర తింకరగా దంతాలు, సెటైరికల్ స్మైల్, మొత్తంగా దెయ్యం లాంటి లుక్‌తో ఈ బొమ్మను డిజైన్ చేశారు.

What is Labubu Doll
Photo Credit: Instagram/Urvashirautela

కర్ధాషియాన్ సిస్టర్స్, రిహాన్నాతో
లబుబు డాల్‌ను లాక్ చేసిన వెంటనే టిక్ టాక్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై ట్రెండ్ అయింది. చాలా మంది ఈ బొమ్మను కొనుగోలు చేసి అన్ బాక్స్ చేసే వీడియోలు వైరల్ అయ్యాయి. దీనికి తోడు బ్లాక్‌పింక్ ఫేమ్ లీసా, రోజ్, కర్దాషియాన్ సిస్టర్స్, రిహాన్నా లాంటి తారలు ఈ బొమ్మను వెంటపెట్టుకొని తిరగడంతో మరింత పాపులర్ అయింది. ఇప్పుడు సెలబ్రిటీలకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఫేవరేట్ డాల్‌గా మారింది.

లబుబు డాల్ ప్రత్యేకత ఏమిటి?
లబుబు డాల్ చూడటానికి వికృతంగా, అస్పష్టంగా, చులకనగా చూసే చూపుతో ఉన్నప్పటికీ.. మంచి క్యారెక్టర్‌గా ప్రొజెక్ట్ అవుతున్నది. ఎదుటి వాళ్ల దిష్టి తగలకుండా, అలాగే దుష్ట ప్రభావం పడకుండా ఉండటానికి, దుష్ట శక్తి దరికి రాకుండా ఉండటానికి, చెడు నుంచి దూరంగా ఉండి మంచి జరిగేందుకు ఈ బొమ్మను తమ వద్ద పెట్టుకొంటున్నారు. అయితే కమ్యూనిటీలు ఇలాంటి బొమ్మను తమ వద్ద ఉంచుకోవడంపై అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ.. ఈ డాల్‌ను ఇష్టపడటం తగ్గలేదనేది ప్రస్తుతం దాని ట్రెండ్ చూస్తే స్పష్టమవుతున్నది.

కరణ్ జోహర్ తన కూతురు వీడియోతో
బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ షేర్ చేసిన వీడియోలో తన దత్త పుత్తిక రూహీ కూడా లబుబు డాల్‌ను పట్టుకొని కనిపించింది. అయితే ఈ వీడియోలో నీవు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నావా? అంటే.. ఇది ట్రెండ్ కాదు.. ఈ డాల్ నా ఫ్రెండ్ అంటూ సమాధానం ఇచ్చింది. దాంతో చిన్న పిల్లలకు కూడా ఈ బొమ్మ నేస్తంగా మారిపోయిందనేది స్పష్టమైంది.

రికార్డు స్థాయిలో లబుబు అమ్మకాలు
ఇక ఇంటర్నేషనల్ స్టాటస్ స్టేటస్ సింబల్‌గ మారిన లబుబు డాల్ ధర ఈబే లాంటి ఆన్‌లైన్ బిజినెస్ పోర్టల్‌లో 30 డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో సుమారుగా 2500 రూపాయలకు పాప్ మార్ట్ అమ్మింది. కేవలం ఈ డాల్ అమ్మకాలతో ఈ సంస్థ 423 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3600 కోట్లకుపైగానే సంపాదించింది పాప్ మార్ట్ హెడ్ ఎమిలీ బ్రోగ్ వెల్లడించారు. ఇటీవల కాలంలో ఈ డాల్ అమ్మకాలు 729 శాతం పెరిగాయని ఆమె తెలిపింది. అయితే ఈ క్రేజ్ ఇటీవల ఇండియాకు పాకడంతో ఇంకా వీటి అమ్మకాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తున్నది.

వింబుల్డన్‌లో ఊర్వశి రౌటేలా రికార్డు
ఇదిలా ఉండగా, వింబుల్డన్ పోటీలలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ఏకంగా నాలుగు లబుబు బొమ్మలతో కనిపించడం మరింత ట్రెండింగ్‌గా మారింది. అయితే డాల్స్‌తో కనిపించడంపై ఒకే వ్యక్తి నాలుగు లబుబు బొమ్మలు కొనడం వరల్డ్ రికార్డు ఏమో అంటూ సెటైర్ వేశాడు. ఊర్వశీ రౌటేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బొమ్మల కారణంగా ట్రెండ్ అవుతున్నది. ఇటీవల టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా తన కారుకు వెనుక భాగంలో వేలాడదీయడం ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయింది.

More from Filmibeat

Read more about: urvashi rautela karan johar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X