twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ వర్జినిటీ ఎప్పుడు పోయింది?... మీ అమ్మను అడుగంటూ ఇలియానా ఘాటు రిప్లై!

    |

    సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా... ఆ తర్వాత తన మకాం బాలీవుడ్‌కు మార్చారు. అయితే అక్కడ ఈ గోవా భామకు ఆశించిన స్థాయిలో అవకాశాలు, గుర్తింపు రాలేదు. అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటున్న ఇల్లీ బేబీ చివరి చిత్రం 'రైడ్' 2018లో విడుదలైంది.

    తాజాగా ఇలియానా #AskMeAnything (ఏమైనా అడగండి) అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. చాలా మంది ఫ్యాన్స్ ఆమె తర్వాతి సినిమా, ఇష్టాలు, అయిష్టాలు లాంటి అంశాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఓ యూజర్ మాత్రం ఇలియానా కన్యత్వం గురించి ప్రశ్నించారు.

    మీ వర్జినిటీ ఎప్పుడు కోల్పోయావ్?

    మీ వర్జినిటీ ఎప్పుడు కోల్పోయావ్?

    ఓ యూజర్ ఇల్లీ బేబీని... మీరు మీ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు? అంటూ ప్రశ్నించారు. వెంటనే ఈ నాజూకు నడుము భామ తనదైన శైలిలో అతడి నోరు మూయించే ప్రయత్నం చేసింది. ‘ఈ విషయంలో మీ అమ్మ ఏం చెబుతుందో ముందు అడిగి తెలుసుకో' అంటూ రిప్లై ఇచ్చింది.

    ఆ హీరోకు కూడా ఇలాంటి పరిస్థితే

    ఆ హీరోకు కూడా ఇలాంటి పరిస్థితే

    గత నెలలో, టైగర్ ష్రాఫ్ కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. ఓ అభిమాని మీరు వర్జినా? అంటూ అడిగే ప్రయత్నం చేశారు. దీనికి అతడు రియాక్ట్ అవుతూ... ‘ఇలాంటివి అడగటానికి సిగ్గులేదా! నా అమ్మ, నాన్న కూడా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు.' అంటూ రియాక్ట్ అయ్యారు.

    గతంలోనూ ట్రోల్స్ మీద విరచుకుపడ్డ ఇలియానా

    గతంలోనూ ఇలియానా తనపై వచ్చే ట్రోల్స్ విషయంలో తనదైన శైలిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో టాప్ లెస్ న్యూడ్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. F * ck మీ అభిప్రాయాలు మాపై రుద్దే ప్రయత్నం చేయొద్దు, నేను నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను అనే అర్థం వచ్చేలా ఓ పోస్ట్ పెట్టారు.

    ఇలియానా చివరి సినిమా?

    ఇలియానా చివరి సినిమా?

    కొందరు అభిమానులు ఆమె తర్వాతి సినిమాల గురించి అడిగారు. మిమ్మల్ని మళ్లీ బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తాము అని ప్రశ్నించారు. తన తర్వాతి సినిమా అనీస్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పాగల్‌పంటి', ఇందులో అనిల్ కపూర్, జాన్ అబ్రహం, అర్షద్ వార్సీ, పుల్కిత్ సామ్రాట్ నటిస్తున్నారని, ఇది నవంబర్ 8న థియేటర్లలోకి వస్తుందని తెలిపారు. ఇలియానా చివరగా తెలుగులో రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంథోనీ (2018)లో నటించారు.

    English summary
    leana D'Cruz interacted with her fans and followers. one Instagram user asked, "Man... When did you lose your virginity...?" leana replied, "Wow. Nosy, much? What would your mother say? Tsk tsk."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X