twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు కడుపా? మీకు కనిపిస్తే కాస్త చెప్పండి బాబు... సమంత వెటకారం!

    |

    హీరోయిన్ సమంత తన తర్వాతి సినిమా 'ఓ బేబీ' రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లలో సామ్ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే తాను గర్భం దాల్చినట్లు వార్తలు రావడంతో ఆమె దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఓ వెబ్ సైట్లో వచ్చిన కథనానికి ఎపిక్ రిప్లై ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    సమంత, నాగ చైతన్య చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. 2015 నుంచి వీరు డేటింగ్ చేస్తున్న విషయం అఫీషియల్‌గా వెల్లడైంది. 2017 అక్టోబర్ 6, 7వ తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లి జరిగి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో అభిమానులు వీరి నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ఎదురు చూస్తున్నారు.

    నాకు కడుపా? మీకు కనిపిస్తే కాస్త చెప్పండి బాబు... సమంత వెటకారం!

    నాకు కడుపా? మీకు కనిపిస్తే కాస్త చెప్పండి బాబు... సమంత వెటకారం!

    ఈ క్రమంలో కొన్ని తెలుగు మీడియా వెబ్ సైట్లలో సమంత గర్భం దాల్చిందనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను సామ్ ఖండించారు. అందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ‘‘నేను గర్భం దాల్చినట్లు మీకు కనిపిస్తే... నాకు కూడా చెప్పండి'' అంటూ వెటకారంగా రిప్లై ఇచ్చారు.

    సోషల్ మీడియాలో సమంత యాక్టివ్

    సోషల్ మీడియాలో సమంత యాక్టివ్

    సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా సమంంత తనపై ఏదైనా తప్పుడు వార్తలు ప్రచారంలోకి వస్తే వెంటనే స్పందిస్తారు. పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన అంశాలను కూడా పారదర్శకంగా ఉంచడం ఆమెకు అలవాటు. అందుకే తనపై వచ్చిన ప్రెగ్నెన్సీ రూమర్లను వెంటనే కట్టడి చేశారు.

    సమంత కెరీర్లో స్పెషల్ మూవీ ‘ఓ బేబీ'

    సమంత కెరీర్లో స్పెషల్ మూవీ ‘ఓ బేబీ'

    సమంత నటిస్తున్న ‘ఓ బేబీ' చిత్రం ఆమె కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమైనది. తొలిసారిగా ఇందులో 60 ఏళ్ల వృద్ధురాలిగా, 20 ఏళ్ల యువతిగా నటిస్తున్నారు. అంతే కాదు ఆమె చేస్తున్న పూర్తి స్థాయి తొలి కామెడీ చిత్రం కూడా ఇదే. ఇటీవల మూవీ ప్రెస్ మీట్లో సామ్ మాట్లాడుతూ... తాను సినిమాల నుంచి వెళ్లిపోయే లోపు ఇలాంటి చిత్రం చేయాలనుకున్నాను, అది ఇప్పటికి సాధ్యమైందని తెలిపారు.

    అప్పుడే పిల్లలను ప్లాన్ చేసుకుంటారేమో?

    అప్పుడే పిల్లలను ప్లాన్ చేసుకుంటారేమో?

    ‘ఓ బేబీ' చిత్రం జులై 5న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు నాగార్జున నటిస్తున్న ‘మన్మధుడు 2'లో సామ్ అతిథి పాత్ర చేస్తోంది. తమిళ చిత్రం ‘96' తెలుగు రీమేక్‌లో శర్వానంద్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాలన్నీ 2019లోనే కంప్లీట్ కాబోతున్నాయి. షూటింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత సమంత, నాగ చైనత్య పిల్లలను కనే విషయంలో ప్లాన్ చేసుకుంటారని టాక్.

    English summary
    The speculations were made about Samantha Akkineni's pregnancy on several occasion. Recently, a Telugu movie portal published a rumour about it. In reply to its tweet, the actress wrote, "Damnnn ....... is she ? When you find out please let us know."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X