నాకు మూడో పెళ్లాంగా వస్తావా? డబ్బు, ఆస్తులు నీవేనంటూ ఎర... హీరోయిన్ షాకింగ్ రిప్లయ్
నటీనటులను పిచ్చిగా ఆరాధించే దేశం మనది. తారకు గుడి కట్టి పూజించడం వారి పేరు మీద రక్తదానాలు, అన్నదానాలు ఇతర సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది ఒక స్థాయి దాటిపోయి తారాలపై పిచ్చి ప్రేమించేసి వారిని పెళ్లి చేసుకోవాలని అనుకునే స్థాయికి అభిమానం చేరుకుంటుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి వారెందరో. తమను పెళ్లి చేసుకోవాలంటూ నటీనటులకు అసభ్యకరంగా సందేశాలు పంపడం, చివరికి జైలు పాలవ్వడం.. ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. తాజాగా ఓ నటికి ఊహించని ప్రపోజల్ ఎదురవ్వడంతో ఆమె ఖంగుతిన్నది. ఈ వివరాల్లోకి వెళితే...
ఇటీవల మలయాళ నటి సనా ఆల్తఫ్‌కు ఓ అభిమాని నుంచి విచిత్రమైన ప్రపోజల్ రావడంతో ఆమె షాకైంది. సనా అందానికి, నటనకు ఫిదా అయిన సదరు అభిమాని ఆమెను డేట్‌కు రమ్మనడం చర్చకు దారి తీసింది. నాకు నీతో డేట్‌కి వెళ్లాలని ఉంది. దానికి ఎంత కావాలి? అలాగే నీకు ఎప్పుడు వీలవుతుందో కూడా చెప్పు. ఇండియా అయినా ఓకే లేదంటే మాల్దీవులు, దుబాయ్ అయినా పర్లేదు అని బాలాజీ అనే వ్యాపారవేత్త మెసేజ్‌లు పెట్టాడు. అయితే దీనిని సనా ఆల్తఫ్ ఏమాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. ఎంత రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడో అంటూ సెటైర్లు వేసింది. తాజాగా మరో నటికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ వీవీఐపీ.. హీరోయిన్‌ను తనకు మూడో భార్యగా వస్తావా? ఇందుకోసం ఆస్తులు, డబ్బు ఇస్తానంటూ ఎర విసిరాడు. దీనికి సదరు హీరోయిన్ షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది.

మలేషియాకు చెందిన నటి, మాజీ బ్యూటీ క్వీన్ అయిన అమీ నూర్ టినీపై ఆ దేశంలోని ఓ వీవీఐపీ కన్నేశాడు. తనకు మూడో భార్యగా వస్తే.. విలాసవంతమైన జీవితం, నెలకు 11 లక్షల రూపాయల భరణంతో పాటు భూములు, ఆస్తులు, కారు వంటివి ఇస్తానని ఆఫర్ చేశాడు. అయినప్పటికీ దానిని ఆమె తిరస్కరించారు. మలేషియా కంటెంట్ క్రియేటర్ సష్వాన్ నజ్రీ పాడ్‌కాస్ట్‌కు డిసెంబర్ 25వ తేదీన అమీ హాజరవ్వగా.. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు.
ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్న ఓ వ్యక్తి నన్ను అతనికి మూడో భార్యగా ఉండమన్నాడు. ఇందుకు ప్రతిఫలంగా ఒక బంగ్లా, కారు, 10 ఎకరాల భూమి, నెల ఖర్చుల నిమిత్తం 11 లక్షల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడని అమీ వెల్లడించారు. ఇప్పుడే కాదు.. గతేడాది మలేషియా మీడియాలో జరిగిన ఓ ఇంటర్వ్యూలోనూ అమీ నూర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. సదరు పెద్ద మనిషి నుంచి నాకు 2019లో ఈ ప్రపోజల్ వచ్చింది. అప్పుడు నా వయసు 23 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో అందాల పోటీలలో చురుకుగా పాల్గొంటున్నానను. ఆ వ్యక్తి మాటలు విన్న వెంటనే నేనూ, నా తల్లి ఆ ప్రతిపాదనను తిరస్కరించాం.
పలు కార్పోరేట్ ఈవెంట్స్‌కు హోస్ట్‌గా ఉండటం వల్ల కొందరు ప్రముఖులు నా ఫోన్ నెంబర్ అడిగేవారు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి మూడో భార్యగా వస్తావా? అని అడిగాడు. అతడికి నా తండ్రి వయసు ఉంటుంది. బ్యూటీ కాంపిటీషన్స్‌లో పాల్గొనడానికి సాయం చేస్తానని, ఇందుకోసం నన్ను పెళ్లి చేసుకోవాలని కండీషన్ పెట్టాడు. అలాగే నేను నా కూతురిని అమ్మదలచుకోలేదని అమ్మ కరాఖండీగా తేల్చేసింది.
జీవిత భాగస్వామి ధనవంతుడిగా ఉండటం ఒక అదనపు ప్రయోజనంగా ఉంటుంది. కానీ శారీరక ఆకర్షణ తనకు ఇప్పటికీ ముఖ్యమేనని అమీ నూర్ అంగీకరించారు. నాకు ప్రపోజ్ చేసిన వ్యక్తి ఐరన్ మ్యాన్ లాగా ఉంటే పర్వాలేవు.. కానీ నా పక్కన తాతలా ఉండకూడదు. ప్రస్తుతానికి నేను ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకున్నాను.. చట్టబద్ధంగా సరైన మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుతో నా తల్లిదండ్రులకు సేవ చేయాలని అనుకుంటున్నాను అని అమీ నూర్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











