Who is Aneet Padda? సయారా బ్యూటీకి యూత్ ఫిదా.. ఇండియన్ స్క్రీన్‌పై కొత్త నేషనల్ క్రష్‌గా!
సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ కోసం నటీనటులు ఏళ్లుగా ఎదురు చూస్తుంటారు. దశాబ్ధాలుగా స్టార్‌డమ్ కోసం కష్టపడేవారు కొందరైతే .. రాత్రికి రాత్రే కొందరు స్టార్స్‌గా అవతరిస్తుంటారు. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. తాజాగా బాలీవుడ్‌లో ఓ చిన్న సినిమాతో రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్‌గా అవతరించింది ఓ ముద్దుగుమ్మ. ఈ వివరాల్లోకి వెళితే..
3 రోజుల్లోనే 80 కోట్ల కలెక్షన్స్
జూలై 18న హిందీలో విడుదలైన సయారా చిత్రం కుర్రకారును ఊపేస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసేనాటికి ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబడుతుందోనని ఉత్కంఠ నెలకొంది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు సహా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పలువురు స్టార్స్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సయారా క్యాస్ట్ అండ్ క్రూ
ప్రతిష్టాత్మక యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆషికి 2 ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వంలో సయారాను తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు ఆహాన్ పాండే, అనీత్ పడ్డా హీరో హీరోయిన్లుగా నటించారు. ఆదిత్య చోప్రా సమర్పకుడిగా, అక్షయ్ విధాని నిర్మాతగా వ్యవహరించారు. ఫాహీమ్ అబ్దుల్లా, తనిష్క్ బాగ్చీ, రిషబ్ కాంత్, అర్సలాన్ నిజామీ, మిథున్ శర్మ, సచతె టాండడన్, పరంపర థాకూర్ స్వరాలు అందించారు. జాన్ స్టీవార్డ్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు వికాస్ శివరామన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. రోహిత్ మక్వానా, దేవేంద్ర మర్దేశ్వర్ ఎడిటర్లుగా పనిచేశారు.
ఓవర్ నైట్ స్టార్‌గా అనీత్ పడ్డా
సయారా సినిమాతో 22 ఏళ్ల అనీత్ పడ్డా రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. నెటిజన్లు ఆమెను మరో నేషనల్ క్రష్‌గా అభివర్ణిస్తున్నారు. సయారా హిట్ నేపథ్యంలో అనీత్ ఎవరు? ఏం చదువుకున్నారు? ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ? సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది? అంటూ సెర్చ్ చేస్తున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు అనీత్ పడ్డా. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ డీయూ జీసస్ అండ్ మేరీ కాలేజ్ నుంచి హ్యుమానిటీస్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం మోడలింగ్‌లో దిగిన అనీత్‌కు సలాం వెంకీ సినిమాలో అవకాశం దక్కింది. ఈ సినిమాలో చిన్న పాత్ర కావడంతో అంతగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత బిగ్ గర్ల్స్ డోంట్ క్రైలో కీలకపాత్ర పోషించారు అనీత్.
ఆడిషన్స్‌లో ఛాన్స్ కొట్టేసిన అనీత్
సలాం వెంకీలో సరైన ప్రాధాన్యత లభించనప్పటికీ అనీత్ అందం, లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడేలా చేసింది. సయారాను తెరకెక్కించే ముందు ఇందులో హీరోయిన్ పాత్ర కోసం మోహిత్ సూరి ఆడిషన్స్ నిర్వహించగా ఇందులో పాల్గొన్న అనీత్ ఛాన్స్ కొట్టేశారు. కట్ చేస్తే సయారాలో ఆమె అందం, నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తూ ఉండటంతో బాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థలు అనీత్ ఇంటికి క్యూ కడుతున్నాయి. పలువురు కుర్ర హీరోలు కూడా అనీత్‌ను తమ పక్కన హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో అనీత్ పడ్డా బాలీవుడ్‌లో గట్టిగా జెండా పాతుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











