Who is Bhagyashri Borse? ఎవరీ భాగ్యశ్రీ బోర్సే? రవితేజ హీరోయిన్ వయసు ఎంతో తెలుసా?

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మాతలుగా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్నది. చాలా ఏళ్ల తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా రావడం అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించేలా చేసింది. అయితే రవితేజ సరసన ఓ బాలీవుడ్ భామను ఎంపిక చేసినట్టు ప్రకటించిన వార్త వైరల్ అయింది. ఆ భామ ఎవరు? ఆమె కెరీర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

రవితేజ నటించే సినిమా కోసం భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేశారు. మోడల్, యువ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నది. హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు ప్రకటించడానికి ముందు భాగ్యశ్రీ నాభి అందాలను బహిర్గతం చేస్తూ రవితేజ వాటేసుకొన్నట్టు చూపించారు. ఆ తర్వాత ఆమె ఫోటోను విడుదల చేశారు.

Who is Bhagyashri Borse? Bollywood beauty to pair Ravi Teja for Harish Shankar movie by People Media Factory

రవితేజ సరసన నటించబోయే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అంటూ చీరకట్టులో అందాలను ఆరబోస్తున్న ఫోటోను రిలీజ్ చేశారు. చీరకట్టులో ఆమె ఆకట్టుకొనేలా కనిపించింది. క్లాస్, మాస్ అవతారాల్లో ఘాటైన షోజునిచ్చింది. ప్రస్తుతం రిలీజైన ఆమె ఫోటో మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే.. పూణె నగరానికి చెందిన అందాల భామ మోడల్‌గా రాణిసున్నారు. ఆమె వయసు 33 సంవత్సరాలు. ఇటీవలనే బాలీవుడ్ సినిమా యారియాన్ 2 హిందీ సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె నటనకు, అందాల ఆరబోతకు మంచి రెస్సాన్స్ వచ్చింది.

Who is Bhagyashri Borse? Bollywood beauty to pair Ravi Teja for Harish Shankar movie by People Media Factory

యారియన్ 2 సినిమాలో భాగ్యశ్రీ బోర్సే యాక్టింగ్ ప్రతిభను చూసిన హరీష్ శంకర్ సెలెక్ట్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు ఆమె హాజరు అవుతారని వెల్లడిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X