Ma Bava Manobhavalu పాటలో బాలయ్యకు అందాల ఆరబోసిన బ్యూటీ ఎవరంటే? దేశం నుంచి వచ్చిందంటే?
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. నటసింహ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నది.
వీరసింహారెడ్డి' జనవరి 12న ప్రేక్షకుల ముందుకు నేపథ్యంలో మా బావ మనోభావాలు పాటను రిలీజ్ చేయగా, బ్లాక్ బస్టర్ హిట్స్ నిలిచింది. అయితే ఈ పాటలో అందాలను ఆరబోసిన భామ ఎవరనే ప్రశ్నార్థకంగా మారింది. మా బావ అంటూ గ్లామర్ ట్రీట్ పంచిన బ్యూటీ ఏ దేశానికి చెందిన నటి అనే వివరాల్లోకి వెళితే..

మా బావ మనోభావాలు అంటూ బ్యూటీ
నా పేరు చంద్రిక రవి. మా బావ మనోభావాలు పాటలో నటించాను. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. నా పాటను చూసి హిట్ చేసినందుకు మీకు, నందమూరి అభిమానులకు, దర్శకుడు గోపిచంద్ మలినేని, మైత్రీ మూవీస్‌కు ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సాహించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్యూ అని చంద్రిక రవి తెలిపారు.

బాలయ్య సార్ సినిమాలు చూసి..
నేను ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగాను. సౌత్ ఇండియా, ఇండియన్ సినిమాలు చూసి పెరిగాను. ముఖ్యంగా బాలయ్య సార్ సినిమాలు చేసి పెరిగాను. అలాంటి బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా పాటలో స్టెప్పులేసే అదృష్టం నన్ను వరించింది. దాంతో తెలుగు సినిమాల్లో నటించాలనే, బాలయ్య కలిసి నటించాలనే నా చిరకాల కోరిక నెరవేరింది అని చంద్రిక రవి చెప్పింది.

నా జీవితం ధన్యమైంది అంటూ
మా బావ మనోభావాలు పాట షూటింగు రోజున మొదటిసారి సెట్‌లో అడుగుపెట్టగానే.. మ్యూజిక్, సెట్స్, లైటింగ్ చూసి మురిసిపోయాను. అలాంటి సెట్‌లో అడుగుపెట్టి నడుస్తుంటే.. నాకు ఇంత గొప్ప అవకాశం లభించిందా అనే సంతోషం కలిగింది. కొరియోగ్రఫి, సెట్ డిజైన్, డ్యాన్సర్లు పనితీరు అద్బుతంగా ఉంది. బాలయ్య సార్‌తో గడిపిన క్షణాలు ఓ మధురానుభూతి. ఆయన నుంచి చాలా నేర్చుకొన్నాను. నా జీవితానికి సరిపడిన మధురానుభూతులు కూడగట్టుకొన్నాను అని చంద్రిక రవి చెప్పారు.

జై బాలయ్య అంటూ చంద్రిక
మా బావ మనోభావాలు పాటను ప్రేమించి.. ఆదరించిన ప్రతీ ఒక్క అభిమానికి రుణపడి ఉంటాను. నాపై ప్రేమను కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. దీంతో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనే నా డ్రీమ్ పూర్తయింది. ఈ పాట ఎన్నో ఏళ్లు పార్టీలో మార్మోగుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. జై బాలయ్య అంటూ చంద్రిక రవి తన ఆనందాన్ని పంచుకొన్నది.
మా బావ మనోభావాలకు భారీ రెస్పాన్స్
ఇక నందమూరి బాలకృష్ణ, హానీ రోజ్, చంద్రిక రవి నటించిన మా బావ మనోభావాలు పాటకు అన్ని ఫ్లాట్‌ఫామ్‌లో భారీ రెస్పాన్స్ వస్తున్నది. ఇప్పటికే ఈ పాటకు సోషల్ మీడియా, యూట్యూబ్‌లో కలిపి 15 మిలియన్ల వరకు వ్యూస్ వచ్చాయి. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఇంకా ఈ పాటకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











