Devil బాలీవుడ్ బ్యూటీతో కల్యాణ్ రామ్ రొమాన్స్.. డెవిల్ మూవీలో హీరోయిన్ ఎవరంటే?
బింబిసార బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం డెవిల్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత అభిషేక్ నామా స్వయంగా నిర్మిస్తూ దర్వకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అవుతున్నది. కల్యాణ్ రామ్ సరసన రూపొందుతున్న ఈ బ్యూటీ ఎవరంటే?
పిరియాడిక్ ఫిల్మ్‌గా రూపొందుతున్న డెవిల్ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజైన టీజర్‌కు భారీ స్పందన లభించింది. టీజర్ పెంచిన క్రేజ్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 24వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సెన్సేషన్ ఎల్నాజ్ నోరౌజీ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఎల్నాజ్ నౌరోజీ పాత్రను రిలీజ్ చేస్తూ డెవిల్ సినిమాలో ఆమె రోజీ అనే పాత్రలో నటిస్తున్నారని తెలియజేయడానికి సంతోషంగా ఉన్నాం. థియేటర్‌లో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. బాలీవుడ్‌లో ఆమె తన అందచందాలతో ఆకట్టుకొంటున్నది. ఆమె అద్బుతంగా చేసే నాట్య విన్యాసాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు అని అభిషేక్ నామా పిక్చర్స్ వెల్లడించింది.
తెలుగు సినిమా పరిశ్రమలో అభిషేక్ పిక్చర్స్ ఎన్నో సంచలన చిత్రాలను అందించింది. అలాంటి బ్యానర్ ద్వారా ఎల్నాజ్ నోరౌజీ టాలీవుడ్‌కు పరిచయం కావడం విశేషంగా మారింది. ఇక ఎల్నాజ్ విషయానికి వస్తే.. మోడల్‌గా వినోద రంగంలో ప్రవేశించింది. లాకోస్టే, డియోర్, మెర్సిడెజ్ బెంజ్ లాంటి ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది.

ఎల్నాజ్ నోరౌజీ సినిమా కెరీర్ విషయానికి వస్తే..మాన్ జావో నా చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.
హల్లో ఛార్లీ, ఖిడో ఖుండి లాంటి చిత్రాల్లో నటించడం ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకొన్నది. ప్రస్తుతం జుగ్ జుగ్ జీయో చిత్రంలోను నటించింది. అలాగే అభయ్ వెబ్ సిరీస్ నటించింది. ప్రస్తుతం సెక్రెడ్ సీరీస్‌లో నటించేందుకు సిద్దమైంది. ప్రస్తుతం డెవిల్ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఈ సినిమాలోని ఆమె హాట్ లుక్‌ను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











