కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఎవరు? ఆయన బిజినెస్, బ్యాక్‌గ్రౌండ్ ఏమిటంటే..

తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు, ఊహాగానాలకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెరదించింది. కొద్దికాలంగా ముంబైకి చెందిన వ్యాపారవేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతున్నారని, ఇప్పటికే ఆమెకు ఎంగేజ్‌మెంట్ జరిగిందనే వార్తలపై కాజల్ పెదవి విప్పలేదు. కానీ కాజల్ అగర్వాల్ మంగళవారం తన పెళ్లిపై సెన్సేషనల్ ప్రకటన చేయడంతో గతంలో వచ్చిన రూమర్లకు బలం చేకూరింది. కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతున్న గౌతమ్ కిచ్లూ ఎవరు? అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఏమిటంటే..

Recommended Video

Kajal Aggarwal Fiance Gautam Kitchlu's Full Details
 యువ వ్యాపారవేత్త గౌతమ్‌తో నా పెళ్లి అంటూ

యువ వ్యాపారవేత్త గౌతమ్‌తో నా పెళ్లి అంటూ

నేను పెళ్లి చేసుకోవడానికి ఎస్ చెప్పాను. ప్రముఖ యువ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకోవబోతున్నాను. ముంబైలో అక్టోబర్ 30వ తేదీన నిరాడంబరంగా మా పెళ్లి జరుగుతుంది. లాక్‌డౌన్ సమయంలో కుటుంబ వేడుకగా జరిగే పెళ్లికి అతికొద్ది మంది మాత్రమే హాజరవుతారు అంటూ కాజల్ అగర్వాల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పెళ్లి వార్తను అందించింది.

 ఇంటీరియర్ డిజైనర్‌గా

ఇంటీరియర్ డిజైనర్‌గా

ఇక కాజల్ కాబోయే భర్త గౌతమ్‌కు డిస్క్రెన్ లివింగ్ అనే డిజైనర్ షాష్ వ్యవస్థాపకుడు. ఇంటిరీయర్ డిజైనర్‌గా సుపరిచితుడు. సృజనాత్మకమైన డిజైన్లు చేసే అభిరుచి కల వ్యక్తి. గౌతమ్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన డిజైన్లు సృజనాత్మకతతో ఆకట్టుకొనేలా ఉన్నాయి.

 డిజైనర్ ఫర్నీచర్ వ్యాపారం

డిజైనర్ ఫర్నీచర్ వ్యాపారం

ఇక గౌతమ్ ఇంటీరియర్ డిజైన్ షాపుల నిర్వహణే కాకుండా డిజైనర్ ఫర్నీచర్‌ అమ్మకాలను కూడా నిర్వహిస్తుంటారు. ఇంటిలో డెకరేటివ్, పెయింటింగ్స్, ఇతర గృహోపకరణాల వ్యాపారంలో ఉన్నారు. అంతేకాకుండా పలు రకాల వ్యాపారాల్లో భాగస్వామి అని తెలుస్తున్నది.

సోషల్ మీడియా యాక్టివ్‌గా

సోషల్ మీడియా యాక్టివ్‌గా

ఇక కాజల్ ఫియాన్సీ గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉన్నారనే విషయం ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్, ఇతర అకౌంట్లను చూస్తే తెలుస్తుంది. గౌతమ్‌కు ఇన్స్‌టాగ్రామ్‌లో 20 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువగా తన అకౌంట్లలో డిజైన్లు, ఇతర ఫోటోలు మాత్రమే కనిపిస్తాయి.

 కాజల్ అగర్వాల్ కెరీర్..

కాజల్ అగర్వాల్ కెరీర్..

ఇక కాజల్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి అచార్య చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2లో కనిపిస్తారు. విష్ణు మంచుతో కలిసి నటిస్తున్న మోసగాళ్లు చిత్రం టీజర్ ఇటీవల రిలీజైంది. ఇంకా రెండు ప్రాజెక్టులు రిలీజ్ కావాల్సి ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X