Who is Natalie Burn? ఎవరీ నటాలీ బర్న్? టాక్సిక్ టీజర్‌లో యష్‌తో రెచ్చిపోయిన బ్యూటీ ఎవరంటే?

Toxic Movie: కన్నడ స్టార్ యాశ్ (Yash) దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుడు ముందుకు సిద్దమవుతున్నారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ (Toxic). ఈమూవీ నుంచి విడుదలైన హీరో ఇంట్రడక్షన్ టీజర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరో యష్‌ను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని డార్క్, బోల్డ్ అవతార్‌లో చూపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

టీజర్ ప్రారంభం నుంచే డార్క్ టోన్, శ్మశాన నేపథ్యంలో యష్ ఎంట్రీ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. 'రాయ' అనే పాత్రలో ఆయన కనిపించిన తీరు, మెషిన్ గన్‌తో శత్రువులను చీల్చి చెండాడే సన్నివేశాలు మాస్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. అయితే ఇదే టీజర్‌లో కారులో ఉన్న బోల్డ్, ఇంటిమేట్ సీన్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. 'ఇంత బోల్డ్‌గా యష్‌ని చూపించాలా?'అంటూ కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Hollywood Actress Natalie Burn Goes Viral With Yash in Toxic Movie Teaser

ఇంతకీ టీజర్ లో హీరో యష్‌తో రెచ్చినపోయిన ఆ నటి ఎవరో? అని మూవీ లవర్స్ గూగుల్, సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆ గ్లామర్ బ్యూటీ ఎవరో కాదు.. హాలీవుడ్ నటి నటాలీ బర్న్ (Natalie Burn). ఉక్రెయిన్‌లో జన్మించిన నటాలీ బర్న్ (అసలు పేరు నటాలియా గుస్లిస్టాయా) 2006లో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

నటాలీ బర్న్ 'ది ఎక్స్‌పెండబుల్స్ 3', 'మెకానిక్ : రిసరెక్షన్', 'ది కమ్ బ్యాక్ ట్రైల్', 'టిల్ డెత్ టు అస్ పార్ట్' వంటి యాక్షన్, థ్రిల్లర్ చిత్రాల్లో నటించారు. నటి మాత్రమే కాకుండా మోడల్, స్క్రీన్‌రైటర్, నిర్మాతగా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు.. '7 హెవెన్ ప్రొడక్షన్స్ (7 Heaven Productions)' అనే నిర్మాణ సంస్థను నెలకొల్పింది. ఇప్పటికే ఐదు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు.అంతేకాకుండా.. ఈ బ్యూటీకి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉంది. నెట్టింట్లో ఎన్నో వీడియోలు వైరలవుతున్నాయి. అలాగే ఆమె నాలుగు భాషలు మాట్లాడగలగడం మరో విశేషం. సుమారు రూ.150 కోట్లకు పైగా నెట్ వర్త్ ఉన్నట్లు సమాచారం.

'టాక్సిక్'తో ఇండియన్ సినిమాల్లో ఎంట్రీ.. ఇదే తొలిసారి నటాలీ బర్న్ ఇండియన్ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'టాక్సిక్'లో ఆమె పాత్రను గోప్యంగా ఉంచినప్పటికీ, టీజర్‌లో కనిపించిన సీన్‌తోనే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. యష్-నటాలీ మధ్య ఉన్న రిలేషన్ ను చూస్తే.. ఈ సినిమాలో కీలకంగా ఉండనుందని అర్థమవుతోంది.

ఇక 'టాక్సిక్'మూవీలో యష్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు విజేత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతూ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్ వెర్షన్లుగా విడుదల కానుంది. మార్చి 19న 'టాక్సిక్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

'టాక్సిక్' టీజర్ యష్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా మారింది. బోల్డ్ కంటెంట్‌పై విమర్శలు వస్తున్నప్పటికీ, అదే సమయంలో సినిమాపై క్రేజ్, క్యూరియాసిటీ అమాంతం పెరిగింది. యష్ కొత్త అవతార్, నటాలీ బర్న్ ఎంట్రీతో 'టాక్సిక్' విడుదలకు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు అందరి చూపూ... ఈ బోల్డ్ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద సఫలమవుతుందా? అనేది వేచిచూడాలి.

More from Filmibeat

Read more about: yash toxic hollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X