Prashanth Varma: ప్రశాంత్ వర్మ సూపర్ ఉమెన్ మూవీ... హీరోయిన్ ఎవరంటే?

టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల తేజ సజ్జాతో సూపర్ హీరో చిత్రం హనుమాన్ తెరకెక్కించి సూపర్ హిట్టును కొట్టాడు. ఇక ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చింది. అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో 12 సినిమాలు రాబోతున్నాయి. అందులో భాగంగానే ఓ సూపర్ ఉమెన్ సినిమా కూడా రాబోతుంది. అయితే ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అసలు ఆ హీరోయిన్ ఎవరు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రశాంత్ వర్మ.. మొదటి సినిమా అ!తో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక ఆ తర్వాత తేజ సజ్జా హీరోగా జాంబీరెడ్డి అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రం కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు హనుమాన్ సినిమాతో ఇండియన్ వైడ్ ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక హనుమాన్ చిత్రంతో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తక్కువ ఖర్చులో మంచి అవుట్ పుట్ ఇచ్చి హనుమాన్ సినిమాతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాడు.

Who is the Heroine in HanuMan Director Prashanth Varmas Super Woman movie?

ఇక హనుమాన్ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన మొదటి చిత్రం. ఇక ఈ మూవీలో సూపర్ హీరోగా తేజ సజ్జా కనిపించాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. జై హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా పాత్ర చిన్నగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే రాముడు, అంజనేయ పాత్ర పెద్దగా ఉంటుందని... ఆ పాత్రల్లో స్టార్ హీరోలు ఉండబోతున్నట్లు వెల్లడించారు.

ఇక హనుమాన్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రచ్చరేపుతుంది. కేవలం 60 కోట్లతో తెరకెక్కిస్తే.. 200 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి.. సంచలనం సృష్టిస్తుంది. జై హనుమాన్ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత పలు సూపర్ హీరో, హీరోయిన్ల సినిమాలు ఉండనున్నాయట. మొత్తం ప్రశాంత్ వర్మ 12 సూపర్ హీరో సినిమాలు తీస్తానని... ఆల్రెడీ ఆరు సినిమాలకు రైటింగ్ వర్క్ జరుగుతుందని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చారు.

Who is the Heroine in HanuMan Director Prashanth Varmas Super Woman movie?

ఒక సినిమా షూటింగ్ లో ఉందని... అందులో ఓ ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ సినిమా ఉంటుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. అయితే ఆ సూపర్ హీరోయిన్ సినిమా చేసేది జ్ఞానేశ్వరి కాండ్రేగులతో అని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జ్ఞానేశ్వరి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చింది. పెళ్లిచూపులు అనే షోతో ఫేమ్ తెచ్చుకున్న జ్ఞానేశ్వరి కండ్రేగుల... ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది.

Who is the Heroine in HanuMan Director Prashanth Varmas Super Woman movie?

పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా జ్ఞానేశ్వరి చేసిన సంగతి తెలిసిందే. మంత్ ఆఫ్ మధు, నీ జతగా, మాయలో, మిస్టర్ అండ్ మిస్.. సినిమాల్లో జ్ఞానేశ్వరి నటించి.. ప్రేక్షకులను మెప్పించింది. పలు సిరీసుల్లో కూడా జ్ఞానేశ్వరి నటించింది. జ్ఞానేశ్వరి ఇటీవల ఇంటర్వ్యూలో... ప్రశాంత్ వర్మ తీయబోయే సూపర్ వుమెన్ సినిమాలో నేనే లీడ్ రోల్ చేస్తున్నానంటూ చెప్పుకువచ్చింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X