Who is Zaheer Iqbal? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌తో సోనాక్షి వివాహం..జహీర్‌తో అలా పెళ్లి ఎందుకు చేసుకొన్నదంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. ఒకప్పటి సూపర్ స్టార్, షాట్ గన్ శతృఘన్ సిన్హా కూతురుగా మంచి పాపులారిటీ ఉన్న సోనాక్షి హిందీ సినీ పరిశ్రమలో పెద్దగా ఊరు, పేరు లేని హీరోను చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే పెళ్లికి ముందు వారిపై రకరరకాల ట్రోలింగ్ జరిగింది. ఆ ట్రోలింగ్‌ను ఎదిరించి ఇక్బాల్‌ను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే?
ఇక జహీర్ ఇక్బాల్ విషయానికి వస్తే.. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కుమారుడు. బాంబే స్కాటిష్ స్కూల్‌లో విద్యాభాస్యం పూర్తి చేసుకొన్నారు. 2019లో నోట్‌బుక్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత డబుల్ ఎక్స్ఎల్, రష్యన్ సినిమాల్లో నటించాడు. అంతేకాకుండా బ్లాక్ బస్టర్ అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో కూడా నటించాడు.

సోనాక్షి సిన్హాతో ఏడేళ్ల క్రితం ఓ పార్టీలో ఇక్బాల్‌కు పరిచయం జరిగింది. వారి పరిచయం మరింత సన్నిహితంగా మారి ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల డేటింగ్ తర్వాత వారిద్దరు ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్దపడ్డారు. వారిద్దరి పెళ్లి వార్త రాగానే కొన్ని వర్గాలు ట్రోల్ చేశాయి.
అయితే ఇక్బాల్ ముస్లిం కావడంతో సోనాక్షి మతం మార్చుకోవడానికి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ట్రోలింగ్ నేపథ్యంలోను, అలాగే తండ్రి శతృఘన్ సిన్హా బీజేపీలో కొనసాగడం వల్ల పెళ్లికి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉండటంతో ఇండియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం పెళ్లి జరిగింది.

మతాంతర వివాహం, కులాంతర వివాహలు, భారతీయేతరులను వివాహం చేసుకొనే పరిస్థితుల్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. ఈ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకొంటే.. సంప్రదాయాలు, ఆచారాలు పాటించనక్కర్లేదు. కాబట్టి కేవలం పెళ్లికి ఇద్దరికి సమ్మతమే అని సంతకాలు చేసి.. అనంతరం రిసెప్షన్ కార్యక్రమాన్ని బాలీవుడ్ ప్రముఖులు ఇచ్చారు.
ముంబైలో జరిగిన మ్యారేజ్ రిసెప్షన్‌కు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, చంకీ పాండే, హ్యుమా ఖురేషి, కాజోల్, రేఖ, అతిధి, సిద్దార్థ్, విద్యాబాలన్, సిద్దార్థ్ రాయ్ కపూర్, రవీనా టాండన్, ఆదిత్య రాయ్ కపూర్; సైరాబాను తదితరులు హాజరయ్యారు. బిజినెస్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











