Who Milind Chandwani? చిన్నారి పెళ్లి కూతురుకు నిశ్చితార్థం.. అవికా గోర్ కాబోయే భర్త ఎవరో తెలుసా?

హిందీలో బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా చేసుకొన్న అవికా గోర్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నది. హిందీ, తెలుగు, ఇతర భాషల్లో బిజీగా మారిన ఈ యువ హీరోయిన్ తన ఎంగేజ్‌మెంట్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకొన్నది. ఈ అందాల భామ మనసును దోచిన అబ్బాయి ఎవరనే వివరాల్లోకి వెళితే..

అవికా గోర్ కెరీర్ విషయానికి వస్తే.. 2008 సంవత్సరంలో రాజ్‌కుమార్ ఆర్యన్ అనే టెలివిజన్ సీరియల్ ద్వారా వినోద పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అదే సంవత్సరం బాలికా వధు సీరియల్‌లో నటించడం మొదలుపెట్టారు. రెండేళ్లపాటు కొనసాగిన ఈ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకొని విశేషంగా పాపులారిటిని సంపాదించుకొన్నారు. ఈ సీరియల్‌ను తెలుగులో చిన్నారి పెళ్లికూతురు అనే టైటిల్‌తో అనువదించగా అదే రేంజ్‌లో పాపులారిటీ రేటింగ్ సంపాదించుకొన్నది. ఆ తర్వాత వధువు సీరియల్, ఝలక్ దిక్లాజా, ఫియర్ ఫ్యాక్టర్ లాంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

Avika Gor engaged to Milind Chandwani

ఇక వెండితెర మీద మార్నింగ్ వాక్ అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టినప్పటికీ.. తెలుగులో ఉయ్యాల జంపాలా సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చకొన్నది. ఆ తర్వాత లక్ష్ీమ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నదాన, రాజు గారి గది 3, పాప్ కార్న్, షణ్ముఖ సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు.

Avika Gor engaged to Milind Chandwani

ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే.. మిలింద్ ఛంద్వానీతో ప్రేమలో పడ్డారు. దాదాపు వారిద్దరూ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. వారిద్దరూ తమ అఫైర్‌ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాలకు తెలియజేసి.. నిశ్చితార్థం చేసుకొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నారి పెళ్లికూతురుకు ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా, మిలింద్ చంద్వానా హైదరాబాద్ నివాసి. బెంగళూరులో బీఈ చదువుకొన్నారు. ఆహ్మదాబాద్‌లోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఉద్యోగానికి స్వస్తి చెప్పి సామాజిక సేవలో భాగమయ్యారు. క్యాంప్ డైరీస్ అనే ఎన్జీవోను స్థాపించి ఆర్థికంగా వెనుకబడన పిల్లలకు ఉచిత విద్యా బోధనలో సహకారం అందిస్తున్నారు. అలాగే ఎంటీవీ రోడీస్ రియల్ హీరోస్, జీ హీరోస్ అనే రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నారు.

More from Filmibeat

Read more about: avika gor tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X