Pooja Hegde బుట్టబొమ్మకు పూరి జగన్నాథ్ కళ్లు చెదిరే ఆఫర్.. జనగణమన కోసం రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న అందాల భామ పూజా హెగ్గే కెరీర్ గ్రాఫ్ జోరుగా దూసుకెళ్తున్నది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్టులను పూజా హెగ్డే సొంతం చేసుకొంటున్నది. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బుట్టబొమ్మ ప్రస్తుతం విజయ్ దేవరకొండ పక్కన నటించేందుకు సిద్దమైంది. ఈ సినిమా కోసం ఆమె అందుకొంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆమె రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

మూడు డిజాస్టర్లతో పూజా హెగ్డే

మూడు డిజాస్టర్లతో పూజా హెగ్డే

పూజా హెగ్గే కెరీర్ విషయానికి వస్తే.. గత రెండు నెలల్లో మూడు భారీ ప్రాజెక్టులు, ముగ్గురు అగ్ర హీరోలతో కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రభాస్‌తో రాధేశ్యామ్, విజయ్‌తో కలిసి బీస్ట్, రాంచరణ్‌తో కలిసి ఆచార్య చిత్రంలో నటించింది. అయితే ఈ మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి.

పూజా హెగ్డేకు ఆఫర్ల వెల్లువ

పూజా హెగ్డేకు ఆఫర్ల వెల్లువ


వరుసగా మూడు డిజాస్టర్లు పలకరించినా పూజా హెగ్డేకు ఆఫర్ల వెల్లువ తగ్గినట్టు కనిపించలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి ఆదరణ, ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న హీరోయిన్ కావడంతో ఆమె గ్లామర్‌పై నిర్మాత, దర్శకులు పూర్తిగా ఆధారపడుతున్నారనే విషయం ఇటీవల కనిపిస్తున్న పరిణామాలతో స్పష్టమవుతున్నది.

 విజయ్ దేవరకొండతో జనగణమన

విజయ్ దేవరకొండతో జనగణమన


పూజా హెగ్డే ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రానున్న జన గణ మన చిత్రంలో నటించేందుకు సిద్దమయ్యారు. ఈ సినిమా కోసం పూరీ జగన్నాథ్ భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్దమైనట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఏ హీరోయిన్ అందుకోనంత రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం.

పూరి జగన్నాథ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్

పూరి జగన్నాథ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్


లైగర్ తర్వాత విజయ్ దేవరకొండతో జనగణమన చిత్రాన్ని పూరీ జగన్నాథ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పూజా హెగ్డేను 45 రోజుల పాటు డేట్స్ అడిగినట్టు ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ సినిమా కోసం రెండున్నర కోట్ల రూపాయల నుంచి బేరసారాలు మొదలుపెట్టి.. చివరకు 4.5 కోట్ల వద్ద రెమ్యునరేషన్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా


దక్షిణాదిలో ప్రస్తుతం అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొంటున్న హీరోయిన్లలో నయనతార, సమంత రుత్ ప్రభు ఉన్నారు. అయితే వారిద్దరు 2.5 నుంచి 3 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకొంటున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం వారిద్దరిని కూడా అధిగమించి టాప్ రేంజ్‌లో 4.5 కోట్లు తీసుకోవడం చర్చనీయాంశమైంది.

 సల్మాన్‌ ఖాన్‌తో కాటమరాయుడు రీమేక్‌లో

సల్మాన్‌ ఖాన్‌తో కాటమరాయుడు రీమేక్‌లో


ఇక పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా కాటమరాయుడు రీమేక్‌గా రూపొందుతున్న కభీఈద్ కభీ దీవాళీ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నది. ఈ సినిమా షూటింగు ఇటీవల గోదావరి జిల్లాలో ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలోను, రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్, తెలుగులో త్వరలో రిలీజ్ కానున్న F3 చిత్రంలో కనిపించనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X