సౌందర్య లాస్ట్ మూవీ ఎందుకు రిలీజ్ కాలేదో తెలుసా?

అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్య అభిమానులకు దూరమై నేటికి 20 ఏళ్లు పూర్తవుతుంది. తన అందం అభినయంతో కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అమ్మడి డెత్ యానివర్సరీ నేడు. ఈ సందర్భంగా సౌందర్య చివరి సినిమా ఏంటి? ఎందుకు రిలీజ్ కాలేదు అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.

సౌందర్య రైతు భారతం అనే మూవీతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ త్రిపురనేని వరప్రసాద్ సౌందర్య తండ్రిని ఒప్పించి కర్ణాటక నుంచి టాలీవుడ్ లోకి ఆమె ఎంట్రీ ఇచ్చేలా చేశారు. ఇక ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు నిర్విరామంగా నటించిన సౌందర్య ఒకానొక సమయంలో తన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమకు మరొక సావిత్రి దొరికింది అంటూ మురిసిపోయేలా చేసింది.

why actress soundarya last movie gelupu not released till now do you know reasons behind here details

31 ఏళ్ల అతి చిన్న వయసులోనే 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో కన్ను మూసింది సౌందర్య. అప్పట్లో జరిగిన ఎలక్షన్స్ లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన మీటింగ్ లో క్యాంపెయిన్ చేయడానికి సౌందర్య తన సోదరుడు అమర్నాథ్ తో కలిసి బెంగళూరు నుంచి కరీంనగర్ బయలు దేరింది. అదే ఆమెను సినీ ప్రియులు చివరి సారిగా చూడడం. ఆ విమానం కుప్పకూలడంతో సౌందర్య శవం కూడా దొరకనంతగా కాలిపోయింది. అప్పట్లో ఈ ఊహించని ఘటన సౌందర్య అభిమానులను, సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది.

కాగా చివరగా సౌందర్య చివరి చిత్రం తెలుగులో విష్ణువర్ధన్‌తో "ఆప్త మిత్ర" అనే పేరుతో వచ్చింది, ఇది సూపర్ డూపర్ హిట్. ఆ తరువాత ఆమె బాలయ్యతో కలిసి నర్తనశాల అనే మూవీ చేయాల్సి ఉంది. కానీ సౌందర్య అకాల మరణం కారణంగా అది ఆగిపోయింది. ఇక సౌందర్య చిట్ట చివరగా నటించిన మరో మూవీ గెలుపు. ఆమెను సినిమా పరిశ్రమకు తీసుకు వచ్చిన త్రిపురనేని వరప్రసాద్ స్వయంగా అడగడంతో, ఆయన మీదున్న అభిమానంతోనే ఈ మూవీలో కొన్ని నిమిషాల పాటు నటించడానికి స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఒప్పుకుందట సౌందర్య. అయితే ఈ మూవీ ఉషా కిరణ్ మూవీ సంస్థ వల్ల విడుదల కాకుండా ఆగిపోయిందని వరప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ముందుగా గెలుపు మూవీ రైట్స్ ను ఉషా కిరణ్ మూవీస్ వారు 10% బడ్జెట్ కి మించి తీసుకుంటామని ఒప్పుకున్నారట. దీంతో సినిమా షూటింగ్ టైంలో ఎంతమంది అడిగినా వరప్రసాద్ ఉషా కిరణ్ మూవీస్ వారి మీద నమ్మకంతో ఎవ్వరికి ఇవ్వలేదట. కానీ సినిమా షూటింగ్ పూర్తయ్యే నాటికి ఉషా కిరణ్ మూవీస్ వారు వరుస డిజాస్టర్లతో నష్టాల్లో కూరుకుపోయారట. అలాంటి సమయంలో గెలుపు మూవీని కొనడానికి వెనకడుగు వేశారట.

why actress soundarya last movie gelupu not released till now do you know reasons behind here details

అయితే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఆ మూవీని కొనడానికి వేరే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఒప్పుకోకపోవడంతో అది స్టూడియోలోనే ఇప్పటికి అలాగే ఉండిపోయిందని సమాచారం. అలా సౌందర్య నటించిన చివరి మూవీ గెలుపు ఉషా కిరణ్ మూవీస్ వల్ల విడుదలకు నోచుకోకుండా పోయిందని టాక్.

ఇక ఊహించని విధంగా మృత్యువాత పడి సౌందర్య అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది.. ఆమె మరణించి 20 సంవత్సరాలు గడుస్తున్నా తెలుగు అభిమానులు సౌందర్యను ఇంకా ఆరాధిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు సౌందర్యను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X