లవర్‌ను వదిలేసిన జాన్వీ.. ప్రియుడికి దూరంగా తమన్నా.. వయ్యారి భామల మతలబు ఏంటంటే?
ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని విధంగా అత్యంత భారీ ఖర్చుతో, అత్యంత విలాసవతంగా తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని రాధిక మర్చంట్‌తో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు జరిపించిన విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి దేశాధినేతలు, రాజకీయ నేతలు, వ్యాపార, పారిశ్రామిక, సినీ, క్రీడా రంగ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకలో బ్రేకప్స్ సెలబ్రిటీలు, లవర్స్‌తో కలిసి రావడానికి కొందరు సినీ తారలు సిగ్గుపడ్డారు. అలా ప్రముఖంగా కనిపించిన వారెవరంటే..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి ప్రపంచంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న సినీ తారలందరూ క్యూ కట్టారు. హాలీవుడ్, బాలీవుడ్, ఇండియాలో ఇతర భాషల్లో ఉండే టాప్ హీరోలు, హీరోయిన్లు హాజరయ్యారు. ప్రపంచ సినిమాను ఒక వేదిక మీదకు తీసుకొచ్చిన పండుగ మాదిరిగా కనిపించింది.

అయితే ఈ వేడుకలో సినీతారలు కొందరు తమ ఫ్యామిలీతో కలిసి వచ్చి సందడి చేశారు. మరికొంత మంది విడాకులు, బ్రేకప్, సపరేట్ అయిన సెలబ్రిటీలు ఒక్కరొక్కరుగా వచ్చారు. అలా రావడంలో వారికి ఏమీ ఇబ్బంది అనిపించలేదనేది వారు స్టేజ్‌పై కెమెరాలకు ఫోజిచినప్పుడు కనిపించలేదు.
అయితే యంగ్ హీరోయిన్, శ్రీదేవీ ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌కు కొద్దికాలంగా శిఖర్ పహారియాతో కలిసి అఫైర్ నడుపుతున్నదనే విషయం అందరికి తెలిసిందే. అయితే అంబానీ మ్యారేజ్ రిసెప్షన్ విషయానికి వస్తే.. జాన్వీ ఒంటరిగా రాగా, శిఖర్ కూడా ఒంటరిగా వచ్చారు. ఎవరి వారు వేర్వేరుగా రావడం, పార్టీలో వారిద్దరూ కూడా కలిసిన దాఖలు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక హీరోయిన్ తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మ డేటింగ్ వ్యవహారం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ చిలకగోరింకల్లా కలిసి మెలిసి ఉంటున్నారు. కానీ అనంత్ అంబానీ మ్యారేజ్ రిసెప్షన్‌కు మాత్రం ఇద్దరు వేర్వేరుగా వచ్చారు. వేడుకలో వారిద్దరూ కలిసినట్టు కూడా కనిపించకపోవడం గమనార్హం.
జాన్వీ కపూర్, తమన్నా భాటియా ఇద్దరి వ్యవహారం ఆసక్తిగా మారడమే కాకుండా అనేక గాసిప్స్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఈ రెండు జంటలు ఎందుకు కలిసి రాలేదు. కావాలనే వారు వేర్వేరుగా వచ్చారా? అనే కథనాలు మీడియాలో కనిపిస్తున్నాయి. వారిద్దరూ ఈ విషయంపై వివరణ ఇస్తే అసలు విషయం బయటకు వస్తుంది.


Click it and Unblock the Notifications











