Prabhas ప్రభాస్ మూవీ నుంచి స్టార్ హీరోయిన్ ఔట్... కారణం ఏమిటంటే?
టాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోలతో ఆడి పాడిన పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. రీసెంట్ గా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ టాలీవుడ్ లో తను ఇప్పటిదాకా చేజార్చుకున్న సినిమాల లిస్ట్ ను తాజాగా వెల్లడించింది. మరి ఇంతకీ రకుల్ మిస్సయిన ఆ సినిమాలు ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
మోడలింగ్ తో కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ కెరీర్ మొదట్లో ప్రభాస్, నాగచైతన్య వంటి హీరోల సరసన నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు మిస్ ఇండియా పోటీలకంటే ముందే సినిమా ఛాన్స్ వచ్చిందని, ఇంటర్ అయిపోగానే ఒక కన్నడ మూవీ ఆఫర్ వచ్చిందనే విషయాన్ని వెల్లడించింది.

తాను అసలు సినిమాలు, టీవీ ఎక్కువగా చూసేదాన్ని కాదు కాబట్టి సౌత్ ఇండస్ట్రీ అనేది ఉంటుందనే విషయమే తెలియదని రకుల్ చెప్పుకొచ్చింది. సౌత్ అంటే బాగుండదేమో అనే ఉద్దేశంతోనే తాను తన ఫస్ట్ మూవీని రిజెక్ట్ చేశానని, అయినప్పటికీ ఆ మూవీ ప్రొడ్యూసర్ తన జాతకాన్ని బట్టి తాను ఒక పెద్ద స్టార్ అవుతానని నమ్మి తనను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడానికి పట్టుబట్టాడని గుర్తు చేసుకుంది.
ఇక ఆ తర్వాత ఓ పెద్ద మూవీకి సైన్ చేసిందట రకుల్. అదికూడా ప్రభాస్ మూవీ కావడం విశేషం. ఆ మూవీ మిస్టర్ పర్ఫెక్ట్ కాగా, నాలుగు రోజుల షూటింగ్ తర్వాత తనను మార్చేసారట. అలాగే ఆటోనగర్ సూర్యకి కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందని తెలిపిన రకుల్ ఆ బాధతో ఏదో ఒక రోజు కచ్చితంగా స్టార్ కావాలని ఫిక్స్ అయ్యానని తాజాగా చెప్పుకొచ్చింది.

ఇక ఆ తర్వాత ఆమె టాలీవుడ్ లో స్టార్ గా ఎలా ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు బిజినెస్ కూడా పెట్టేసింది. ఈ నెలలోనే రకుల్ హైదరాబాద్లోని మాదాపూర్ లో ఆరంభం అనే రెస్టారెంట్ ను ప్రారంభించబోతోంది.
ఇక ఇటీవల బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకొన్న రకుల్ ప్రస్తుతం హిందీ సినిమాలపైనే దృష్టిపెట్టింది. సినిమాల్లో నటిస్తూనే.. బిజినెస్ రంగంలోకి ప్రవేశించింది. గతంలో హెల్త్, ఫిట్‌నెస్ బిజినెస్‌లో కొనసాగుతున్న ఆమె.. తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నది. ఆరంభం అనే రెస్టారెంట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్టు తెలిపింది.


Click it and Unblock the Notifications











