Rashmika Mandanna యువ హీరో మూవీకి రష్మిక మందన్న గుడ్‌బై.. అల్లు అర్జున్ కారణమా?
కన్నడ సినీ పరిశ్రమ నుంచి కెరీర్ ఆరంభించిన రష్మిక మందన్న ఇండియన్ సినిమా స్థాయికి చేరుకోన్నది. పుష్ప మూవీ సూపర్ హిట్ కావడంతో ఓవర్‌నైట్ నేషనల్ క్రష్‌గా మారిపోయింది. పుష్ప హిట్ తర్వాత బాలీవుడ్‌లో భారీ సినిమాలతో దూసుకు పోతున్నది. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది. అయితే తెలుగులో నితిన్, వెంకీ కుడుముల సినిమా ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంపై అనేక రూమర్లు మీడియాలో చోటు చేసుకొన్నాయి. అయితే రష్మిక ఆ సినిమా నుంచి తప్పుకోవడం వెనుక ఉన్న కారణాల్లోకి వెళితే..
అందాల భామ రష్మిక మందన్నను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల. కన్నడలో కిరిక్ పార్టీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రష్మికను ఛలో సినిమా ద్వారా పరిచయం చేశాడు. నాగశౌర్య, రష్మిక జంటకు ప్రేక్షకుల భారీ రెస్పాన్స్ రావడంతో ఛలో భారీ హిట్ సాధించింది. ఆ తర్వాత రష్మిక మళ్లీ వెనుకకు చూసుకోలేదు.

ఛలో సినిమా తర్వాత గీతా గోవిందం, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో తనకంటూ తెలుగులో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంతోపాటు స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత మళ్లీ వెంకీ కుడుములతో భీష్మ అనే సినిమాలో నటించింది. భీష్మ కూడా మంచి హిట్ కావడంతో రష్మికకు మరింత క్రేజ్ పెరిగింది. తెలుగులో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా మారిపోయింది.
తెలుగు, కన్నడతోపాటు తమిళంలో కూడా భారీ ఆఫర్లు వచ్చాయి. ఇక పుష్ప సినిమాతో రష్మిక మందన్న రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లింది. అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. యువ హీరోలతో కలిసి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ కెరీర్ గ్రాఫ్‌ను పరుగులు పెట్టిస్తున్నది.
అయితే తాజాగా వెంకీ కుడుములతో మూడోసారి రష్మిక మందన్న జతకట్టింది. వెంకీ కుడుముల, నితిన్ ప్రాజెక్టు కోసం ఆమోదం తెలిపింది. అయితే అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం రకరకాల ఊహగానాలకు దారి తీసింది. అయితే వెంకీ కుడుముల, నితిన్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంపై రష్మిక పీఆర్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2, తమిళ, తెలుగు భాషల్లో రెయిన్ బో చిత్రాలతోపాటు మరో తెలుగు సినిమా, మరో రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే పలు చిత్రాల్లో నటించడం వల్ల నితిన్, వెంకీ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ కావడం లేదు. దాంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాలని రష్మిక నిర్ణయించుకొన్నది అని పీఆర్ వర్గాలు తెలిపాయి. తాను ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి ముందు నిర్మాత, దర్శకులతో చర్చించిన అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











