Samantha Ruth Prabhu తీసేసి రష్మికను పెట్టుకొన్న నిర్మాత.. సామ్ తొలగింపు వెనుక కారణం ఎవరు?
సినిమా పరిశ్రమ అంటే అనిశ్చితి.. అనిశ్చితి అంటే సినిమా పరిశ్రమలో కనిపిస్తుంటుంది. ఓ ప్రాజెక్టులో ఓ హీరోనో లేదా హీరోయిన్‌నో ప్రకటించేసి.. ఆ తర్వాత మరొకరిని తీసుకోవడమనేది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. ఈ విషయంలో సమంత కూడా అతీతం కాదని తెలిసిపోయింది. అయితే గతంలో సమంతను హీరోయిన్‌గా ప్రకటించిన ఓ సినిమా ప్రాజెక్టులోకి రష్మిక మందన్న రావడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకొన్నాదా? లేదా సమంతను తప్పించారా? అనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. సమంత స్థానంలోకి రష్మిక వచ్చిన సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

సమంతతో డ్రీమ్ వారియర్స్
తమిళ సినిమా పరిశ్రమలోనే కాకుండా దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్స్ సంస్థ కొద్ది నెలల క్రితం సమంతతో ఓ ప్రాజెక్టును ప్రకటించింది. అయితే యశోద సినిమా షూటింగులో సమంత ఉండటం, ఆ తర్వాత ఆమె మయోసిటిస్ వ్యాధికి గురి కావడంతో ఆ ప్రాజెక్టు స్టార్ట్ కావడం ఆలస్యమైంది. అయితే కట్ చేస్తే సమంత స్థానంలోకి రష్మిక మందన్న రావడం, ఆ సినిమా ప్రారంభం కావడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

రష్మిక మందన్నతో రెయిన్ బో
పుష్ప మూవీతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న రష్మిక మందన్నతో డ్రీమ్ వారియర్స్ సంస్థ ఇటీవల ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ సినిమాకు రెయిన్ బో అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శాకుంతలం సినిమాలో నటించిన దేవ్ మోహన్‌ను హీరోగా తీసుకొన్నారు. అయితే సమంత లేకుండా ఈ సినిమా స్టార్ చేయడంపై నిర్మాత క్లారిటీ ఇచ్చిన విషయం ఏమిటంటే?

సమంత తొలగింపుపై నిర్మాత ఏమన్నారంటే?
రెయిన్ బో సినిమాకు సమంతతో చేయాలనుకొన్నాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల రష్మిక మందన్న మా ప్రాజెక్టులోకి వచ్చింది. అయితే కొన్ని స్క్రిప్టులు తమకు సూటయ్యే ఆర్టిస్టులను వెతుక్కొంటాయనే విషయం ఈ సినిమాతో ప్రూవ్ అయింది. సమంత బదులు రష్మికను ఈ స్క్రిప్టు ఎంచుకొన్నది అంటూ నర్మగర్భంగా నిర్మాత ఎస్ఆర్ ప్రభు వివరణ ఇచ్చారు.

ఖుషీతో సమంత బిజీగా
అయితే సమంత బదులు రష్మిక ప్రాజెక్టులోకి రావడానికి కారణం ఏమిటంటే.. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో సమంత ఇంటికే పరిమితమైంది. ఇప్పుడిప్పుడే సమంత షూటింగులకు హాజరవుతున్నది. సమంత ప్రస్తుతం త్వరగా ఖుషీ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. తాను ఎక్కువ సమయం ఖుషీ సినిమాను పూర్తి చేయడానికి సిద్దమైంది. అందుకే రెయిన్ బో సినిమాను సమంత వదులుకొన్నది అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

సమంత షాకింగ్ నిర్ణయం
అయితే కేవలం ఖుషీ సినిమా మాత్రమే కాకుండా.. సమంత ముందు భారీ ప్రణాళిక ఉంది. వచ్చే రెండు, మూడు వారాలపాటు సమంత తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉండే అవకాశం ఉంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా చేసే ప్రమోషన్స్‌లో బిజీగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగుకు హాజరుకావాల్సి ఉండటంతో రెయిన్ బో ప్రాజెక్టును వదులుకొన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











