‘ఆ విషయంలో తప్ప మగాడి అవసరమే లేదు.. పెళ్లి చేసుకోను ఒంటరిగానే ఉంటా’
ఇండియన్ సినిమా పరిశ్రమలో తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడటే తీరు ఎవరికైనా ఉన్నాదంటే.. ఠక్కున గుర్తుకు వచ్చేది టబూ. ఎవరైనా తన వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేస్తే.. ప్రశ్నిస్తే.. మనసులో ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడేస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి అనేక రకాలుగా చర్చ జరుగుతుంది. అయితే తన గురించి ఎవరేమీ మాట్లాడుకొన్న డోంట్ కేర్ అనే ధోరణితో ఉంటారు. గతంలో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జాతీయ మీడియాకు ఆమె చెప్పిన విషయాలు.. టబు ట్రెండింగ్‌లోకి ఎందుకు వచ్చిందంటే?
జీవితంలో సుఖం, సంతోషాలు చాలా విషయాల నుంచి పొందవచ్చు. కేవలం రిలేషన్‌షిప్ వల్లే వస్తాయనుకోవడం పెద్ద తప్పు. మానసికంగా ధృడంగా ఉంటే ఒంటరితనాన్ని చక్కగా డీల్ చేయవచ్చు. జీవితంలోకి సరైన భాగస్వామి రాకపోతే ఎంత నరకం ఉంటుందో ఊహించుకొంటేనే భయమేస్తుంది. దాని కంటే ఒంటరితనమే నయమనిపిస్తుంది అని టబు తన వ్యక్తిగత జీవితంపై అభిప్రాయాలను వెల్లడించింది.

నేను ఒంటరిగా ఉండటంపై చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. కొందరు వాళ్ల జీవితం కంటే.. నా వ్యక్తిగత జీవితంపై రకరకాల మాట్లాడుకొంటారు. వాటిని నేనేమి పట్టించుకోను. వైవాహిక హోదా మనిషి జీవితానికి ముఖ్యం కాదు. ఓ మనిషి లైఫ్‌ను అది డిసైడ్ చేయలేదు. నా లైఫ్ గురించి వేరే వాళ్లు జడ్జ్ చేయడం నాకు అసలు ఇష్టమే ఉండదు అని టబు వెల్లడించాయి.
నాకు పెళ్లి కాలేదని, ఒంటరిగా ఉంటున్నానని కొందరు కామెంట్ చేస్తుంటారు. అలాగే జీవితంలో పిల్లలు లేరు. సంతానం ఉంటే బాగుంటుంది అని ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఇలాంటి విషయాలను వెల్లడించే వారికి నేను దూరంగా ఉంటాను. వారి మాటలను చెవికి ఎక్కించుకోను అని టుబు చెప్పింది.

ఇక టబు కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి భూత్ బంగ్లా అనే సినిమాలో నటిస్తున్నది. అక్షయ్ కుమార్ కేప్ ఆఫ్ గుడ్ బ్యానర్, బాలాజీ టెలిఫిలింస్ బ్యానర్‌పై శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో పరేశ్ రావెల్, వమికా గబ్బి, అభిలాష్ నాయర్, ప్రియదర్శన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు.
గతేడాది టబు నటించిన క్రూ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. కరీనా కపూర్ తదితరులతో కలిసి నటించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రస్తుతం నటించే భూత్ బంగ్లా సినిమాతోపాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే అవి అనౌన్స్ చేస్తామని టీమ్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











