ఆ రోజుని తలచుకుని కుమిలిపోతున్న తమన్నా .. తలబాదుకుంటూ షాకింగ్ పోస్ట్
తన నటన, డ్యాన్స్‌తో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు మిల్కీబ్యూటీ తమన్నా భాటియా. ఇటీవలే నటిగా 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ తరంలో ఈ ఘనత అందుకున్న అతికొద్దిమందిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నప్పటికీ నేటికీ స్టార్ హీరోయిన్‌గా, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కొనసాగుతుండటం సాధారణ విషయం కాదు. ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా తనను తాను మార్చుకుంటూ కెరీర్ సాగిస్తున్నారు తమన్నా.
చేతినిండా ప్రాజెక్ట్స్‌తో తమన్నా
ఈ ఏడాది ఇప్పటికే ఓదెల 2లో కీలకపాత్ర పోషించి.. రైడ్ 2లో నషా సాంగ్‌తో దేశం మొత్తాన్ని ఊపేశారు తమన్నా భాటియా. ప్రస్తుతం రేంజర్, వీ వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్‌తో పాటు రోహిత్ శెట్టి సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇవి చిత్రీకరణ దశలో ఉన్నాయి. అలాగే డార్లింగ్ పార్ట్‌నర్స్ అనే వెబ్ సిరీస్‌లోనూ మిల్కీబ్యూటీ నటిస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతం తమన్నా భాటియా బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

విజయ్ వర్మతో బ్రేకప్
నటుడు విజయ్ వర్మతో బ్రేకప్‌తో నిన్న మొన్నటి వరకు వార్తల్లో నిలిచారు తమన్నా. మూడేళ్ల ప్రేమబంధానికి వీడ్కోలు చెబుతూ ఈ జంట నిర్ణయం తీసుకుంది. రేపో మాపో పెళ్లి వార్త చెబుతారు అనుకుంటే విడిపోయి షాకిచ్చింది ఈ జంట. తమన్నా - విజయ్ విడిపోవడానికి ఖచ్చితమైన కారణం ఏది తెలియరాలేదు. అయితే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోవాలని తమన్నా పట్టుబట్టగా.. కెరీర్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని విజయ్ భావిస్తుండటమే వీరి బ్రేకప్‌కు కారణంగా బీటౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బ్రేకప్ తర్వాత ఎవరిదారులు వారివి అయ్యాయి.
ఫాతిమాతో క్లోజ్‌గా విజయ్
తమన్నాతో విడిపోయిన తర్వాత దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌తో విజయ్ వర్మ ప్రేమలో పడినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఓ రెస్టారెంట్ బయట వీరిద్దరూ అత్యంత క్లోజ్‌గా ఉండటం, విజయ్‌కి ఫాతిమా ముద్దు పెట్టడంతో ఏదో జరుగుతుందన్న రూమర్స్ వచ్చాయి. దీంతో ఈ వివాదంపై ఫాతిమా స్వయంగా స్పందించారు. విజయ్ వర్మకు, తనకు మధ్య ఏం లేదని.. ఒకే సినిమాలో కలిసి నటించే నటీనటులు డిన్నర్‌కు వెళ్లకూడదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ ఈ గాసిప్స్‌కు మాత్రం చెక్ పడటం లేదు.
తమన్నాపై బాడీ షేమింగ్ కామెంట్స్
మరోవైపు.. పాలమీగడ లాంటి శరీరం, ఆకర్షణీయమైన రూపం, సన్నని నడుంతో ఎల్లోరా శిల్పంలా కనిపించే తమన్నా కాస్త బొద్దుగా మారడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేసింది. అసలు మీరు తమన్నాయేనా? ఇలా మారిపోయారేంటీ? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏదో ఒక సినిమా కోసం మేకోవర్ అయ్యుంటారని పలువురు తమన్నాకు మద్ధతుగా మాట్లాడుతున్నారు. పనిగట్టుకుని బాడీ షేమింగ్‌కి పాల్పడొద్దని వార్నింగ్ ఇస్తున్నారు.
నెత్తిబాదుకుంటూ పోస్ట్ వైరల్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తమన్నా భాటియా ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో ఆమె సెగలు రేపుతుంటారు. తాజాగా తమన్నా భాటియా తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చిన పోస్ట్ వైరల్ అవుతోంది. మండే అని సాగదీస్తూ నెత్తిబాదుకుంటూ కారులో వెళ్తున్న ఫోటోను ఆమె షేర్ చేశారు. వీకెండ్‌లో బాగా ఎంజాయ్ చేసి సోమవారం ఆఫీసులకు, పనులకు వెళ్లాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. దీనికి సెలబ్రెటీలు కూడా అతీతం కాదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











