నివేదా థామస్ కు ఏమైంది.. ఎందుకంత బరువు పెరుగుతోంది.. రీజన్?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో పలు ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో నంటించి మెప్పించింది. ఇప్పటికీ హీరోయిన్, పలు విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది. ఛాలెంజింగ్ పాత్రల్లోనూ మెరుస్తూ తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా నివేదా థామస్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె బరువు పెరుగుతుండటం పట్ల అభిమానులు కంగారు పడుతున్నారు. కారణం ఏంటనీ సందేహిస్తున్నారు.

తెలుగు చిత్రాలతో నివేదా థామస్ కు గుర్తింపు..
నివేదా థామస్ చెన్నైలో పుట్టి పెరిగింది. 2008 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోంది. వరుస మలయాళం, తమిళ చిత్రాలతో కేరళ, తమిళనాడు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక 2016లో నేచురల్ స్టార్ నాని నివేదాను టాలీవుడ్ కు పరిచయం చేశారు. నాని - నివేదా థామస్ కాంబినేషన్ లో వచ్చిన 'జెంటిల్ మెన్', 'నిన్ను కోరి' చిత్రాలు వచ్చి అప్పట్లో బిగ్ హిట్ గా నిలిచాయి. దాంతో నివేదాకు ఇక్కడ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జై లవ కుశ, 118, బ్రోచేవరెవరురా, వీ, వకీల్ సాబ్, శాకినీ డాకినీ వంటి చిత్రాల్లో నటింటి ప్రేక్షకులను అలరించింది. చివరిగా 35 అనే చిత్రంలో ఆకట్టుకుంది.

Why Tollywood Actress Nivetha Thomas Getting Over Weight

గద్దర్ అవార్డ్స్ వేడుకలో నివేదా థామస్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 14,15న గదర్ అవార్డ్ ఈవెంట్స్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2024కు సంబంధించిన చిత్రాలకు అన్ని కేటగిరిల్లో అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రమంలో నివేదా థామస్ నటించిన 35 అనే చిత్రానికి గాను ఉత్తమ నటి కేటగిరిలో ఆమెకు అవార్డు వరించింది. ఆ అవార్డు స్వీకరించేందుకు నివేదా వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

బరువు పెరగడానికి కారణం ఏంటీ?
నివేదా థామస్ రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై సందడి చేసింది. పట్టుచీరలో అచ్చమైన తెలుగమ్మాయిలా మెరిచింది. ఇదెలా ఉంటే.. నివేదా థామస్ కొంత కాలంగా లావుగానే ఉండటం చర్చగా మారింది. తను ఎందుకు లావు పెరుగుతున్నదనేది అభిమానుల్లో కంగారుగా మారింది. 35 చిత్రంలో తల్లి పాత్ర కోసమే నివేదా థామస్ అప్పట్లో బరువు పెరిగిందని, ఇక తగ్గడం కష్టంగా మారిందని అంటున్నారు. ఆ పాత్రకు తన బాడీ ట్రాన్స్ ఫార్మ్ తో న్యాయం చేశానని కూడా గతంలో నివేదా బదులిచ్చింది. ఇక బరువు పెరగడానికి రీజన్ మాత్రం ఆ సినిమానే అని అంటున్నారు.

రెండేళ్లుగా నివేదాకు నో ఆఫర్స్..
నివేదా థామస్ కు రెండేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా, అటు తమిళం, మలయాళం ఇండస్ట్రీలోనూ ఎంలాంటి అవకాశాలు అందలేదు. దీంతో నివేదా ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు సినిమా ఛాన్స్ లు రాకపోవడానికి కారణం కూడా ఆమె బరువు పెరగటమనే అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X