గర్బవతి అయిన వైల్డ్ డాగ్ హీరోయిన్... సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ నటి దియా మిర్జా త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని దియా మిర్జా స్వయంగా అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లోకి వెళితే...

దియా మిర్జా వివాహం ఫిబ్రవరి 15 తేదీన వైభవ్ రేఖీతో జరిగింది. దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగుతున్న నేపథ్యంలో దంపతులకు ఆనందం ఉట్టిపడే వార్త తెలిసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఈ భూప్రపంచంలో మాతృమూర్తిగా మారబోతున్నాను. పాటలు, పిల్లలను జో కొట్టే కథలు ఇవన్నీ కొత్తగా మారబోతున్నాయి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు సంబంధించిన డ్రీమ్స్‌లో స్వచ్ఛత ఉంది అంటూ తన పోస్టులో దియా మిర్జా పేర్కొన్నారు.

Wild dog Heroine Dia Mirza reveals her pregnancy in Social media

ఇక దియా మిర్జా కెరీర్ విషయానికి వస్తే... 2000 సంవత్సరంలో దర్శకుడు గౌతమ్ మీనన్ తమిళంలో విజయవంతమైన మిన్నలేను హిందీలో రూపొందించిన రహనా హై తేరే దిల్ మే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించించింది.

ఇక ఇటీవల జాతీయ అవార్డు లభించిన తప్పడ్ సినిమాలో కీలక పాత్రను పోషించారు. అలాగే వైల్డ్ డాగ్ చిత్రంలో నాగార్జునకు భార్యగా అతిథి పాత్రలో కనిపించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X